మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్టతో ‘విశ్వంభర’ చేస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి కెరీర్ లో 156వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా తర్వాత చిరు 157వ సినిమా ఏం చేస్తారా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ హ్యూజ్ ఫ్యాన్ అయిన సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో చిరుతో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లు న్యూస్ వైరల్ గా మారింది. సందీప్ రెడ్డి వంగ.. ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ గట్టిగా వినిపిస్తుంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఆ తర్వాత బాలీవుడ్ లో ఇదే సినిమాను రీమేక్ చేసి పప్పులారీటీ సొంతం చేసుకున్నాడు. అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది ఈసినిమా. ఆ తర్వాత ఇపుడు యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈసినిమా భారీ విజయాన్ని అందుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్, బాలీవుడ్ లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తో సందీప్ రెడ్డి పేరు మారుమ్రోగుతోంది.తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబో సెట్ కానుందా? అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

అది మామూలు కాంబో కాదు.. మెగాస్టార్ చిరంజీవి, యానిమల్ సినిమాతో ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేసిన సందీప్ రెడ్డి వంగ. అవును.. ఈ క్రేజీ కాంబో సెట్ కానుందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశాడు.తాను మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అని తెలిపారు.గతంలో ఒక ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక గ్యాంగ్ స్టార్ కథ సిద్ధంగా ఉందని, ఆయన ఒప్పుకుంటే వెంటనే చేసేస్తానని చెప్పాడు. ఇప్పుడు అదే కథతో సందీప్ మెగాస్టార్ తో సినిమా చేయబోతున్నాడు అని, ఈ ప్రాజెక్టుపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్త గనుక నిజమైతే.. ఇండస్ట్రీని షేక్ చేసే మరో సినిమా రానుంది అనడం ఎలాంటి సందేహం ఉండదు.అయితే ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే? ప్రస్తుతం సందీప్ రెడ్డి ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్నాడు. ఆ తర్వాత యానిమల్ పార్క్ ను స్టార్ట్ చేయనున్నట్లు గతంలో చెప్పాడు. అయితే చిరుతో సందీప్ రెడ్డి మూవీ చేస్తే చూడాలని ఆరాటపడుతున్నారు మెగా ఫ్యాన్స్. కానీ దానికి కొంచెం టైమె పట్టేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: