స్టార్ మా లో ఎంతో మందిని తన క్యూట్ నటనతో ఆకట్టుకున్న చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ ముద్దుగుమ్మ అవికా గోర్ అందరికీ తెలిసే ఉంటుంది.ఈమె తన అంద చందాలతో సీరియల్ ద్వారానే చాలా ఫేమస్ అయింది.ఆ తర్వాత నాగార్జున నిర్మాతగా చేసిన ఉయ్యాల జంపాల మూవీతో హీరోయిన్గా మారిపోయింది. ఇక మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ అవ్వడంతో అవిక గోర్ స్టార్ హీరోయిన్ల కి పోటీ అనుకున్నారు.కానీ సడన్ గా ఈ హీరోయిన్ చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి తెలుగులో అవకాశాలు లేకుండా పోయాయి. ప్రస్తుతం అంది వచ్చిన అవకాశాలను చేసుకుంటూ పోతోంది.ఇక రీసెంట్గా మాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

తాజాగా అవికా గోర్ తన ప్రియుడిని పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. మరి ఇంతకీ అవికా గోర్ ప్రేమించిన అబ్బాయి ఎవరు..వీరి పెళ్లి ఎప్పుడు అనేది ఇప్పుడు చూద్దాం.. అవికా గోర్ ప్రియుడి పేరు మీలంద్ చాంద్వానీ.. అయితే ఈయన కామన్ ఫ్రెండ్స్ ద్వారా అవికా గోర్ కి కలిశారట. అలా ఇద్దరు దాదాపు ఆరు నెలల పాటు తమ మధ్య ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేశారట. ఆరు నెలలు ముగిసాక వారి మధ్య ఫ్రెండ్షిప్ మరింత బలపడడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అలా ఒకరి మనసులో మరొకరికి మంచి స్థానం ఏర్పడిందట. ఆ తర్వాత ప్రేమ విషయాన్ని ముందుగా మీలంద్ చాంద్వానీ అవికా గోర్ కి చెప్పారట.

ఇక మిలంద్ ప్రపోజల్ ని ఓకే చేసిన అవికా గోర్ అప్పటినుండి ఆయనతో రిలేషన్ కంటిన్యూ చేస్తుందట.అయితే పెళ్లి చేసుకోక పోయినప్పటికీ మా ఇద్దరి మనసులు కలిసాయి కాబట్టి మేం మానసికంగా పెళ్లి చేసుకున్నట్టే అని అవికా కూడా చెప్పుకొస్తుంది.అంతేకాదు పెళ్లి గురించి చాలా సార్లు మాట్లాడుకున్నారట. అలాగే అవికా గోర్ కంటే మిలంద్ వయసులో చాలా పెద్దవాడట  అందుకే పెళ్లి విషయంలో అన్ని ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలి అని పెళ్లి అనేది లైఫ్ లో ఒక పెద్ద విషయం అని, అందుకే అన్ని విషయాలు చర్చించుకున్నాకే పెళ్లి చేసుకోవాలి అని చెప్పాడట. ప్రస్తుతం అవికా గోర్ తన ప్రియుడిని పరిచయం చేయడంతో చాలా మంది నెటిజన్స్ అవికా గోర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: