కమల్‌హాసన్‌, రజనీకాంత్‌ ఇద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ వయసులో కూడా పోటీ పడి సినిమాలు చేస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ నటించిన ‘భారతీయుడు 2’ జులై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనితోపాటు మరో 2 సినిమాలు పైప్‌లైన్లో ఉన్నాయి. రజనీకాంత్‌ ‘వేట్టయాన్‌’లో నటిస్తున్నారు. అలాగే లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ‘కూలీ’ చిత్రం చేయబోతున్నారు.కాగాకమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన మూవీ ‘భారతీయుడు 2’. ఈ సినిమా దేశ వ్యాప్తంగా జూలై 12 న థియేటర్లలో రిలీజ్ అయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తో నడుస్తుంది. ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది. టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజున కూడా బాగానే కలెక్ట్ చేసింది. కానీ మూడో రోజున కలెక్షన్స్ వసూలు చేయలేకపోయింది.కాగా ఇటీవల ఈ చిత్రానికి అందరి నుంచి నెగెటివ్‌ కామెంట్స్‌ లభించగా తాజాగా ఈ చిత్రం తనకు నచ్చిందని సినిమా బాగుందని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కామెంట్స్‌ చేయడం అందరిన్ని ఆశ్చర్యపరిచింది. కేరళలోని ఓ వివాహానికి హాజరై చెన్నయ్‌ ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు రజనీకాంత్‌.

కాగా రజినీకాంత్.. ఈ పేరుకు ముందు సూపర్‌స్టార్ లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. ఆ పేరు ఆయన కోసమే పెట్టినట్లుగా సినీ, వ్యక్తిగత జీవితాలతో విశేష ప్రజాదరణ పొందారు. బస్ కండక్టర్ నుంచి సూపర్‌స్టార్ వరకు ఆయన అందుకోని గౌరవం లేదు.. చూడని సత్కారం లేదు. అవార్డుల ఆయనకు దాసోహమయ్యాయి. అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన శివాజి రావ్ గైక్వాడ్ అలియస్ సూపర్‌స్టార్ రజినీకాంత్.కాగా  త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ప్రస్తుతం వ‌రుస‌బెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆయ‌న న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వెట్టాయ‌న్’ ప్రేక్షకుల్లో మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను టిజె.జ్ఞాన‌వేల్ డైరెక్ట్ చేస్తుండ‌టంతో ఈ మూవీపై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి.ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త వినిపిస్తోంది. ‘వెట్టాయ‌న్’ సినిమాకు సంబంధించిన ఓటిటి పార్ట్న‌ర్ ను మేక‌ర్స్ లాక్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్ర‌ముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు కొనుగోలు చేసింద‌ట‌. దీంతో ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయ‌నుంద‌ట అమెజాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: