టాలీవుడ్లో ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట కెరటం సినిమా ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తన కెరియర్ ని మలుపు తిప్పుకుంది. ఆ తర్వాత సరైనోడు, నాన్నకు ప్రేమతో, ధ్రువ తదితర చిత్రాలలో నటించింది. ఎంతో మంది స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఒక్క సారిగా అవకాశాలు దూరమవ్వడంతో బాలీవుడ్ వైపుగా అడుగులు వేసి అక్కడే ప్రముఖ నిర్మాత జాకీ భగ్నని ప్రేమించి మరి వివాహం చేసుకుంది.


ప్రస్తుతం బాలీవుడ్ లోని వరుస ఆఫర్లు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. చివరిగా కొండ పొలం సినిమాలో నటించిన రకుల్ ఆ తర్వాత మరే సినిమాలో కూడా నటించలేదు. ఇటీవల ఇండియన్-2 సినిమాలో నటించిన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూటకటుకుంది. దీంతో రకుల్ ప్రీతిసింగ్ సీక్వెల్ లో నటిస్తే ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుందనే ముద్ర కూడా వేసుకుంది. అటు బాలీవుడ్ లో కూడా సరైన సక్సెస్ లేక సతమతమవుతోంది ఈ ముద్దుగుమ్మ.


అయితే ఇలాంటి సమయంలోనే రకుల్ ప్రీతిసింగ్ కి రీసెంట్గా నెక్సా అవార్డు అందుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఈమె నటించినా చత్రవాలి అనే సినిమాకు ఈ అవార్డు అందుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.స్టైలిష్ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయదు రకుల్ ప్రీతిసింగ్ నెక్స్ట్ అవార్డు ఫంక్షన్కు ఆరెంజ్ కలర్ దుస్తులతో తన బాడీ కాన్ డ్రస్ లో స్టైలిష్ గా కనిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ అవార్డు అందుకుందని తెలిసి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా తన బాడీ ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం  వెనుకడుగు వేయదు.ఎప్పుడు జిమ్ వర్క్ అవుట్లతో బిజీగానే ఉంటుంది. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: