పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన 'కల్కి 2998 ఏడి' మూవీ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉందికల్కి 2898 ఏడి మూవీ రిలీజైన రోజు దగ్గర నుంచి అనేక రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. జూన్ 27 వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 25 రోజులు అయినా కూడా ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ 1100 కోట్ల పైగా గ్రాస్, 617 కోట్ల పైగా షేర్ వసూళ్లు సాధించింది. ఇంకా ఈ సినిమా భారీ వసూళ్లు దిశగా సాగుతోంది. అలానే ఇప్పటికే చాలా రికార్డులను బద్దలకొట్టిన కల్కి మూవీ తాజాగా ఆర్ఆర్ఆర్ రికార్డును కూడా క్రాస్ చేసింది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది సినిమాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాను ఈ సినిమా వెనక్కి నెట్టింది. ఈ నెల నాలుగో ఆదివారమైన జూలై 21వ తేదీన కూడా ఈ సినిమా వసూళ్లు చాలా భారీగానే ఉన్నాయి.


బాలీవుడ్ లో ఎక్కువ కలెక్షన్లు సాధించిన సౌత్ సినిమాల్లో మొదటి స్థానంలో బాహుబలి 2 సినిమా రూ.702 కోట్లు, రెండో స్థానంలో కేజీఎఫ్ 2 రూ.525 కోట్లతో ఉన్నాయి.ఇక కల్కి2898 ఏడీ.. సినిమా రూ.310 కోట్లతో మూడో స్థానానికి చేరింది. ఇప్పటి వరకు మూడో స్థానంలో ఉన్న ఆర్ఆర్ఆర్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమా హిందీ మార్కెట్ లో మొత్తంగా రూ.306.2 కోట్లు వసూలు చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ గా సుప్రీం యాస్కిన్ పాత్ర పోషించి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో కమల్ అసలైన విలన్ అనుకున్నారు. కానీ కల్కి కి విలన్ అంటే కలి అనే సంగతి తెలిసిందే. కాబట్టి ఈ సినిమాలో సుప్రీం యాస్కిన్ రియల్ కాదని ప్రొడక్షన్ నితిన్ చౌదరి చెప్పడం జరిగింది. కల్కి సినిమా చాలా పెద్దదని అందులో మెయిన్ విలన్ కలి అని కలి అండర్ లో యాస్కిన్ ఉంటాడని కలి ఒక కనిపించని శక్తి అని అలాగే కాంప్లెక్స్ లు కూడా మొత్తం 7 ఉంటాయని వాటిని కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ గా రన్ చేస్తూ కలికి రిపోర్ట్ ఇస్తూ ఉంటాడని నితిన్ తెలిపారు. దీంతో పార్ట్ 2 పై అంచనాలు డబుల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: