సీనియర్ నటుడు సుమన్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు.అంతే కాదు ఆయన పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతూ ఉంటారు.అయితే ఇందులో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోలీవుడ్ స్టార్స్ గురించి మాట్లాడుతూ కమల్ హాసన్ పై సంచలన కామెంట్స్ చేశారు. కమల్ హాసన్ కన్న కూతురు శృతిహాసన్ తో కూడా రొమాన్స్ చేయగలరు అంటూ సుమన్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. మరి ఇంతకీ సుమన్ అలాంటి కామెంట్స్ ఎందుకు చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. సుమన్ ఒకప్పుడు స్టార్ హీరోలకి పోటీగా సినిమాలను తీసేవారు.అలా అప్పట్లో ఈయన సినిమాలు చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలకు పోటీగా వచ్చేవి. 

కానీ ఈయన జైలుకు వెళ్లడం కారణంగా సినీ కెరియర్ పై దెబ్బ పడింది. ఆ తర్వాత విలన్ గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. రాణిస్తున్నారు. అయితే అలాంటి సుమన్ కోలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ.. ఒకప్పుడు తమిళంలో శివాజీ గణేషన్,ఎంజీఆర్ వంటి స్టార్ నటులు ఉండేవారు. వారి తర్వాత రజినీ కాంత్ కమల్ హాసన్లు వచ్చారు. ఇక కమల్ హాసన్ మొదటి నుండి హీరో గానే చేసినప్పటికీ రజినీకాంత్ మాత్రం విలన్గా ఎంట్రీ ఇచ్చారు. రజినీకాంత్ తన నడకతోనే ఓ ట్రెండు సృష్టించారు. ఇక కమల్ హాసన్ మాత్రం రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.ఎవరితోనైనా సరే రొమాంటిక్ పాత్రలో అదరగొట్టేవారు. అంతేకాదు ఒక పాత్ర కోసం గుండు కొట్టించుకోవడం,ఒరిజినల్ గడ్డం పెంచుకోవడం కమల్ హాసన్ కే సాధ్యం. అలాగే కమల్ హాసన్ డీ గ్లామరస్ లో కూడా నటించగల సత్తా ఉన్న హీరో.

అయితే ఇలాంటి డీ గ్లామర్ పాత్రల్లో మాలాంటి హీరోలు అయితే చేయడానికి వెనకడుగు వేస్తారు. అలాగే కమల్ హాసన్ ని చూసి ఇప్పటి జనరేషన్ హీరోలు అయినా విక్రమ్, అజిత్ లు నేర్చుకోవచ్చు.ఐదు సంవత్సరాల ఏజ్ లోనే కమల్ హాసన్ సినిమాల్లో చాలా గొప్పగా నటించారు .అయితే అలాంటి ఈ హీరో పాత డిమాండ్ చేస్తే కూతురితో కూడా రొమాన్స్ చేయగలడు..అంటూ కమల్ హాసన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కానీ కమల్ హాసన్ గురించి సుమన్ మాట్లాడిన ఈ మాటలు కొంతమంది నెగటివ్ గా తీసుకుంటే మరి కొంత మంది పాజిటివ్ గా తీసుకుంటున్నారు.ఇక నెగిటివ్గా ఎందుకంటే కమల్ హాసన్ మరీ కూతురితో రొమాన్స్ చేసే అంత దిగజారి పోలేదు అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: