శోభన్ బాబు పౌరాణిక చిత్రాలతో కూడా తనదైన ముద్ర వేశారు. వీరాభిమన్యు, సంపూర్ణ రామాయణం, కురుక్షేత్రం లాంటి చిత్రాలలో నటించారు. ఏఎన్నార్ తర్వాత మహిళల్లో విశేషమైన ఆదరణ పొందిన హీరో అంటే అది శోభన్ బాబు మాత్రమే. శోభన్ బాబు అందరికీ అప్పట్లో మగువలు ఫిదా అయ్యేవారు. హీరోయిన్లు అయితే చాలామంది శోభన్ బాబుతో ఫ్రెండ్ షిప్ చెయ్యాలని ప్రయత్నించారు. శోభన్ బాబు పౌరాణిక చిత్రాలతో కూడా తనదైన ముద్రవేశారు. సంపూర్ణ రామాయణం చిత్ర షూటింగ్ గురించి ప్రముఖ రచయిత కాగల జయ కుమార్ సంచలన విషయాలు రివిల్ చేశారు.


మారేడు మిల్లిలో అవుట్ డోర్ లో షూటింగ్ జరుగుతోంది. దగ్గర్లోని హోటల్ లో బస ఏర్పాటు చేశారు. అది డిసెంబర్ నెల. చలి వనికించే విధంగా ఉంది. షూటింగ్ పూర్తయ్యాక చిత్ర యూనిట్ లో కొంతమంది హోూటల్ దగ్గరలో ఫైర్ క్యాంప్ వేసుకునేవారు. శోభన్ బాబు హీరో కదా..ఆయన రారేమో అనుకున్నాము. కానీ ఒక్కరోజు ఆయన రగ్గు కప్పుకుని సైలెంట్ గా వచ్చి మాతోపాటు ఫైర్ క్యాంప్ లో కూర్చున్నారు. కొత్త పెళ్లికూతురు వచ్చినంత హడావిడి చేస్తున్నారు. కాసేపటి తర్వాత నన్ను పిలిచి తమ్ముడు నా రూమ్ కి వెళదాం రా అని రమ్మన్నారు.


రూమ్ కి వెళ్ళాక మాటలు చెప్పుకుంటూ ఉండగా..ఒక పాట పాడమన్నారు. తాను 'ఒకే మాట ఒకే బాణం ఒకే భామకు రాముని ప్రేమ' అని సాంగ్ పాడాను. పాట బాగుండటంతో మళ్లీ మళ్లీ పాడమన్నారు. అంతకుముందు శోభన్ బాబు క్యాంప్ ఫైర్ కి వచ్చేవారు కాదు. కానీ ఆ తరువాత రోజు రావడం ప్రారంభించారు. ఎందుకు ఈయన రోజు వస్తున్నారు, పైగా నన్ను ఆయన గదికి తీసుకెళ్తున్నారు అని ఆలోచించా. ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. సంపూర్ణ రామాయణం చిత్రంలో హీరోయిన్గా నటించిన చంద్రకళ ఉండేది శోభన్ బాబు పక్క గదిలోనే.

మరింత సమాచారం తెలుసుకోండి: