హీరో ప్రకాష్ రాజ్ మొదట తమిళంలో తన సినీ కెరీర్ ని మొదలుపెట్టారు. ఆ తర్వాత కన్నడ, మలయాళం, హిందీ వంటి అనేక భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నరు. తెలుగులోనే మంచి పాత్రలలో నటించిన ప్రకాష్ రాజ్ టాలీవుడ్ లో హైయెస్ట్ పేరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించారు. ఒకానొక సమయంలో తెలుగు ఈ సినిమాలు ప్రకాష్ రాజ్ నటించనిదే కొన్ని సినిమాలు లేవు అనితలా నటించారు. అలాగే ప్రకాష్ రాజు తెలుగు దర్శకులు నిర్మాతలకు ఇచ్చినటువంటి పాత్రలు మరే పరిశ్రమ కూడా ఇవ్వలేదని చెప్పవచ్చు.



హైదరాబాద్లో నివాసం ఏర్పరచుకొని ఇక్కడే ఉంటున్నారు.. కానీ ఎందుకో అతనికి మాత్రం తెలుగు మీడియా అన్న ప్రేక్షకులు అన్న కాస్త చిరాకు గానే ఉంటారు. తెలుగులో ప్రకాష్ రాజ్ పై వచ్చిన వివాదాలు మరే పరిశ్రమలో కూడా రాలేదని చెప్పవచ్చు.. తెలుగు మీడియా పైన ఎన్నోసార్లు విమర్శలు కూడా చేయడం జరిగింది. అలాగే షూటింగ్స్ కి లేటుగా వస్తారని చాలామంది దర్శకులను ఏడిపిస్తూ ఉంటారని విమర్శలు కూడా ప్రకాశరాజు పైన వినిపిస్తూ ఉంటాయి.


ముఖ్యంగా కొన్ని సినిమాలను ప్రకాష్ రాజు లేటుగా సినిమా షూటింగ్లకు రావడం చూసి చాలామంది అతడిని తీసేసి వేరే నటులను పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.. అలాగే నిన్నటి రోజున ధనుష్ నటించిన రాయన్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో కూడా కాస్త అసహనానికి గురయ్యారు ప్రకాష్ రాజ్.. ధనుష్ 50వ సినిమా అలాగే డైరెక్టర్గా దర్శకుడుగా ఈ సినిమాకి పనిచేశారు. ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన ప్రేక్షకులు కాస్త అరుపులతో స్వాగతం ప్రకాష్ రాజు కు చెప్పారు.. అయితే ప్రకాష్ రాజ్ కొంచెం కోపగించుకొని అరుపులు ఆపండ్రా అని ప్రేక్షకులను ఉద్దేశించి అన్నారు మధ్యలో ప్రేక్షకులు మళ్లీ అరుపులు వినపడితే రెండు నిమిషాలు ఆగుతావా.. కాస్త బాధ్యతగా మాట్లాడదాం అంటూ అసహనాన్ని తెలిపారు.


ఆ తర్వాత ధనుష్ గొప్పతనం చెప్పి అతను అందరికీ ఎలా స్ఫూర్తి అవుతాడు అనే విషయాన్ని తెలియజేశారు. దీంతో ఇప్పుడు మళ్లీ  తెలుగు పరిశ్రమలో ప్రకాష్ రాజ్ గురించి చర్చ జరుగుతోంది. దీంతో ప్రకాష్ రాజు పైన తెలుగు ప్రేక్షకుల పైన ఇంత అసహనాన్ని చూపిస్తున్న మీరు చెన్నైలో ,బెంగళూరులో ఇలా చేయగలరా అంటూ చాలామంది విమర్శిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: