సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో డైరెక్టర్ గా చేస్తూ ప్రేక్షకులని బాగా కట్టుకున్నాడు. రీసెంట్ గా అనిమల్ మూవీలో డైరెక్టర్ గా చేసి మంచి బ్లాక్ బస్టర్ హిట్టును సంపాదించాడు. తన సినిమాల్లో లవ్, ఎమోషనల్, యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కు ప్రయారిటీ  ఇచ్చే డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. సరికొత్త ఇడియాలతో, ట్విస్టులతో ఆకట్టుకుంటూ న్యూ జనరేషన్ హార్ట్ ఫేవరెట్ గా మారిపోయాడు. ఇక అర్జున్ రెడ్డి మూవీ హిట్ తర్వాత అతను మారింత పాపులర్ అయ్యాడు. పైగా ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లోనూ ' కబీర్ సింగ్' పేరుతో తీసి అక్కడ కూడా సక్సెస్ అందుకున్నాడు.


ఆ తరువాత తీసిన యానిమల్ మూవీ కూడా ఎంత యూత్ ఫేవరెట్ అయిపోయిందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అలా సినీ మేకింగ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఫేమ్ క్రియేట్ చేసుకున్న సందీప్ రెడ్డివంగా త్వరలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా తీయబోతుండగా..సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ప్రజెంట్ సందీప్ రెడ్డి వంగాకు సంబంధించిన ఓ విషయంపై అభిమానులు డిస్కస్ చేస్తున్నారు.


ఏమిటంటే..ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సందీప్ రెడ్డి వంగాకు 'నీ కొడుకు పేరు, మీరు తీసిన ఓ సినిమా పేరు ఒకటే కదా..అలా ఎందుకు పెట్టారు' అనే ప్రశ్న ఎదురైందట. ఈ సందర్భంగా అతను సమాధానమిస్తూ.. 'వాస్తవానికి నేను అర్జున్ రెడ్డి మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు అతడు పుట్టాడు. అందుకే వాడికి అర్జున్ రెడ్డి అని పేరు పెట్టాం. పైగా ఈ పేరంటే నాకు చాలా ఇష్టం" అంటూ చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి నెక్స్ట్ మూవీ ఏంటో చూడాలి. సందీప్ రెడ్డి ప్రభాస్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అని ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: