ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి మూవీ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. 25 వ రోజు బాక్స్ ఫీస్ వసూళ్ల తరువాత ఆ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. హిందీ బాక్స్ ఫీస్ దగ్గర అత్యధిక వసూళ్ల సాధించిన సౌత్ సినిమాల్లో ఆర్ఆర్ఆర్ ను వెదక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచింది. నాలుగో ఆదివారం (జులై21) కూడా ఆ సినిమా వసూళ్లు భారీగానే ఉన్నాయి. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమా 25 వ రోజు బాక్స్ ఫీస్ వసూళ్ల కూడా భారీగానే ఉన్నాయి.


ఈ మధ్య రిలీజ్ అయిన తెలుగు, హిందీ సినిమాలను కూడా మించి వసూళ్లు సాధిస్తోంది. ఆదివారం (జూలై 21) ఈ సినిమా డోమెస్టిక్ మార్కెట్లో ఏకంగా రూ.8.25 కోట్ల వసూళ్లు చేసింది. శనివారం (జులై 20) ఈ వసూళ్లు రూ.6.1 కోట్లుగా ఉండగా..మరో 40 శాతం పెరిగాయి. దింతో 25 రోజుల్లో కలిపి ఇండియాలో కల్కి 2898 ఏడి నెట్ వసూళ్లు రూ.616.7 కోటుకు చేరాయి. ముఖ్యంగా హిందీ మార్కెట్లో ఈ మూవీ జోరు కొనసాగుతోంది. తాజాగా రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ మూవీని మించి హిందీ మార్కెట్లో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాల్లో మూడో స్థానానికి చేరింది.


ఇన్నాళ్లు రూ.306 కోట్లతో మూడో స్థానంలో ఉన్న ఆర్ఆర్ ఆర్..ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది. కల్కి 2898 ఏడి మూవీ 25 వ రోజు వసూళ్లు చూస్తే..హిందీ మార్కెట్ లోనే రూ.4.85 కోట్లు వచ్చాయి. దీనితో అక్కడ మొత్తం 25 రోజుల కలెక్షన్లు రూ.310 కోట్లకు చేరాయి. తొలి స్థానంలో బాహుబలి 2 రూ.702 కోట్లతో కొనసాగుతుండగా..రెండో స్థానంలో కేజిఎఫ్ 2 రూ.525 కోట్లతో ఉంది. కల్కి మూడో స్థానానికి చేరగా..ఆర్ ఆర్ ఆర్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఆర్ఆర్ఆర్ హిందీ మార్కెట్లో మొత్తంగా రూ.306.2 కోట్ల వసూళ్లు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: