యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌ హీరోగా నటించిన ప్రతిష్టాత్మక సినిమా భారతీయుడు 2/ ఇండియన్ 2. కోలీవుడ్ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెరకెక్కించిన ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ పతాకాలపై ప్రముఖ నిర్మాత సుభాస్క‌ర‌న్ నిర్మించారు.సుమారు 27 ఏళ్ల క్రితం కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఇండియన్ 2పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. అయితే ఇన్ని అంచనాల మధ్య విడుదలైన భారతీయుడు 2 సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తోంది. సినిమాలో కమల్ హాసన్ నటన అదిరిపోయినప్పటికీ మళ్లీ అదే రొటీన్ సబ్జెక్ట్‌ను శంకర్ తీసుకొచ్చారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.అవుట్ డేటెడ్ స్టోరీతో మూడు గంటల పాటు సినిమాను సాగదీశారని నెగెటివ్ టాక్ వస్తోంది. అలాగే కమల్ హాసన్ వేసిన గెటప్స్ కొన్ని అంతగా సూట్ కాలేదని చెబుతున్నారు. ఇకపోతే చిత్రాన్ని మాత్రం భారీ నిర్మాణ విలువలతో రిచ్‌గా తెరకెక్కించారని అంటున్నారు.కాగా భారతీయుడు 2 రిలీజ్ కు ముందే మేకర్స్, ఓటీటీ సంస్థల మధ్య డీల్ కుదిరింది. అందుకు ఇండియిన్ 2 నిర్మాతలకు నెట్‌ఫ్లిక్స్ భారీగానే ముట్టజెప్పిందని సమాచారం. దీని ప్రకారం థియేట్రికల్ రిలీజ్ తర్వాత రెండు నెలలకు అంటే సెప్టెంబర్ 12 తర్వాతనే భారతీయుడు 2 ఓటీటీలోకి రావాల్సి ఉంది. అయితే రిలీజ్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. అంచనాలు తారుమారయ్యాయి. రోజురోజుకు కలెక్షన్లు కూడా డ్రాప్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల థియేటర్ల నుంచి భారతీయుడు 2 మాయమైపోయింది. దీంతో చాలామంది ఆడియెన్స్ ఇక ఓటీటీలోనే కమల్ హాసన్ ను చూద్దామని ఫిక్స్ అయ్యారు. ఈనేపథ్యంలో భారతీయుడు 2 ఓటీటీ రిలీజ్ డేట్ మారిందని టాక్. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ కాకుండా ఆగస్టు 2నే భారతీయుడు ను ఓటీటీలోకి రిలీజ్ చేయాలని నెట్ ఫ్లిక్స్ భావిస్తుందట. ఒక వేళ ఈ డేట్ కుదరకపోతే స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చే ఛాన్స్ ఉందట. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వెలువడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: