నటి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో అందంగా ఉన్నప్పటికీ ఈ భామకి అదృష్టం కలిసి రావడం లేదు. సినిమాల్లో ఎంతో అద్భుతంగా నటించినప్పటికీ పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో సక్సెస్ కాలేకపోతోంది ఐశ్వర్య రాజేష్. తాను నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఈ బ్యూటీ ఏ మాత్రం ఆలోచించకుండా వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది.


ఒకానొక సమయంలో ఈ భామ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు స్పెషల్ క్రిటిక్ అవార్డును అందుకుంది. అంతేకాకుండా తమిళనాడు నుంచి బెస్ట్ యాక్ట్రెస్ గా సైమా అవార్డును కూడా గెలిచింది. ఐశ్వర్య రాజేష్ అచ్చ తెలుగు అమ్మాయి. ఈమె తండ్రి రాజేష్ ....ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేసి 38 ఏళ్ల వయసులోనే కన్నుమూసినటువంటి రాజేష్ కుమార్తెనే ఈ ఐశ్వర్య రాజేష్. ఇక ఐశ్వర్య సినిమాల మీద ఉన్న ఆసక్తితో తన చదువు పూర్తికాగానే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.


ఇక ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారుతుందో చెప్పలేము. ఇప్పుడు ఈ బ్యూటీ విషయంలోనూ అదే జరిగింది. అందం ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ తమిళనాట స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అక్కడ వరుసగా సినిమాలు చేసుకుంటూ అందరికీ షాక్ ఇస్తోంది. ఏకంగా ఈ అమ్మడు చేతిలో తమిళంలో 7 సినిమాలు ఉన్నాయి. అంతేకాకుండా మరో నాలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. అయితే ఈ బ్యూటీకి తెలుగులో హీరోయిన్గా పెద్దగా అవకాశాలు రావడంలేదని తెగ ఫీల్ అవుతుందట.


దీంతో అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తుందట. ఈ క్రమంలోనే ఐశ్వర్యకు ఛాన్సులు ఇస్తానని ఓ టాలీవుడ్ నిర్మాత ఆఫర్ చేశాడట. కానీ అతను చెప్పిన విధంగా చేయాలని..... అంతేకాకుండా కమిట్మెంట్స్ కి ఒప్పుకోవాలని కండిషన్ పెట్టాడట. దీంతో ఐశ్వర్య ఈ ఆఫర్ ను తిరస్కరించిందట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: