టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య పేరు ఈ మధ్య తరచూ వినిపిస్తోంది.. వీరితో పాటు హీరోయిన్ మాల్వి మల్హోత్రా పేరు కూడా మరింత పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా లావణ్య ను ప్రేమించి మోసం చేశాడని ఆమె కేసు పెట్టడంతో ఒక్కసారిగా వీరందరి పేర్లు తెరమీదికి వచ్చాయి.. ముఖ్యంగా తాము విడిపోవడానికి ముఖ్య కారణం హీరోయిన్ మాల్వి  మల్హోత్రాలతో ఉన్న అక్రమ సంబంధమే అంటూ ఆమె వెల్లడించింది. అయితే లావణ్య గురించి అటు రాజ్ తరుణ్ గురించి మాల్వి మలహోత్ర గురించి ఎన్నో రకాల వార్తలు సైతం బయటికి వినిపిస్తూ ఉన్నాయి.


అయితే ఇప్పుడు తాజాగా లావణ్య అసలు క్యారెక్టర్ని సైతం రాజ్ తరుణ్ స్నేహితులలో ఒకరైన శేఖర్ భాష పలు మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూల పలు విషయాలను తెలిపారు.. ముఖ్యంగా లావణ్య క్యారెక్టర్ ఒక అబద్ధమని ఆమె డ్రగ్స్ ను కూడా అమ్మేదని ఈ విషయంలో చాలాసార్లు బుక్ అయ్యిందని కూడా రాజు తరుణ్ స్నేహితుడు శేఖర్ భాష తెలియజేశారు.. ముఖ్యంగా లావణ్య కు మస్తాన్ రావు అనే వ్యక్తి నుంచి మత్తు పదార్థాలు వస్తూ ఉండేది.. వాటిని తక్కువ ధరకు కొని అధిక ధరకు బయట అమ్ముకునేది అంటూ తెలియజేశారు శేఖర్.


మస్తాన్ రావు, లావణ్య తరచు ఎక్కువగా కలుస్తూ ఉండేవారని మస్తానికి కూడా ఇతర అమ్మాయిలతో చాలానే ఎఫైర్స్ వంటివి కలిగి ఉన్నాడని.. లావణ్య కు తెలిసినా కూడా ఈ విషయం పైన నిలదీస్తే వీరిద్దరూ కలిసి ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు ఫోటోలు వీడియోలను తీసి మస్తాన్ రావు ఈమెను బ్లాక్ మెయిల్ చేశారని కూడా తెలిపారు. ఇప్పుడు లావణ్య కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతోందనిపిస్తోంది అంటూ తెలిపారు శేఖర్. అంతేకాకుండా గత ఏడాది గుంటూరులో మస్తాన్ రావు తన చెల్లి పెళ్లి ఉందని లావణ్యని పిలిపించి మరి ఆమె మీద దాడి చేసి రేప్ చేయించారని కూడా ఆమె కంప్లైంట్ లో ఇచ్చినట్లుగా ఒక ఎఫ్ఐఆర్ కాపీని కూడా శేఖర్ బయట పెట్టడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. లావణ్య కూడా అమాయకురాలు కాదే అంటూ పలువురు నేటిజెన్సు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: