ఈ రోజు లోక్ సభ లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తమకు ఎలాంటి వెసులు బాటును కల్పిస్తారు. ఎంత మొత్తంలో బడ్జెట్ ను ఇస్తారు అనే దానిపై ఆంధ్ర ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే చాలా మంది ఆంధ్ర ప్రజలు ఈ సారి ఎన్నికల అనంతరం బి జె పి కి మొత్తంగా చూసుకుంటే పెద్దగా బలం లేకపోవడం , ఇక కూటమికి అత్యంత ఎక్కువ బలం ఉండడంతో స్పెషల్ స్టేటస్ అడిగితే చాలా మంచిది. ఇదే అతనుగా వారిని ఇరకాటంలో పెట్టి ప్రత్యేక హోదా తెచ్చుకోవచ్చు అని చాలా మంది అన్నారు.

కాకపోతే ప్రత్యేక హోదా కంటే కూడా బడ్జెట్ లో అనేక రాయతీయులు తెచ్చుకోవడం మంచిది అనే ప్రతిపాదనను కూడా కొంత మంది సూచించారు. ఇక పోతే ఈ రోజు బడ్జెట్ లో అలాంటి వెసులుబాటు ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటుందేమో అని తెలుస్తుంది. ఇకపోతే ముఖ్యంగా ఐటీ రంగానికి ప్రోత్సాహం ఏమైనా ఉంటుందా అనేది ప్రత్యేక అంశంగా మారింది. ఇప్పటికే ఐటీ రంగానికి కేంద్రం ఇచ్చే ప్రోత్సాహం ఏంటి అనే దానిపై అంశం కీలకంగా మారింది. ఇప్పటికే ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు దేశ వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు గత బడ్జెట్ లో కూడా కేటాయించారు.

కాకపోతే ఏది పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యారు. దానితో ఈయనకు కేంద్రం ఏమైనా సహాయం చేస్తుందా అనేది కీలక అంశంగా మారింది. మరి ఐటి అభివృద్ధి విషయంలో చంద్రబాబుకు కేంద్రం కనుక పెద్ద స్థాయిలో సహకరించినట్లు అయితే అది ఎంతో కీలక అంశంగా మారుతుంది. మరి ఈ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటీ రంగ అభివృద్ధికి ఎలాంటి బాధ్యతను కేటాయిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: