యువ హీరో కిరణ్ అబ్బవరం తన లేటెస్ట్ మూవీ కా టీజర్ తో అంచనాలు పెంచాడు. వినరో భాగ్యము విష్ణు కథతో హిట్ అందుకున్న కిరణ్సినిమా తర్వాత వరుసగా రెండు ఫ్లాప్ సినిమాలు చేశాడు. ఐతే కిరణ్ కెరీర్ లో వెనకపడుతున్నాడు అనుకుంటున్న టైం లో క అంటూ ఒక ఎక్స్ పెరిమెంట్ తో వస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ టీజర్ తోనే సినిమాపై సూపర్ బజ్ పెంచారు.

ఐతే కిరణ్ కా సినిమాకు బిజినెస్ అదిరిపోయిందని తెలుస్తుంది. ఇంతకుముందు ఫ్లాపుల్లో ఉన్నా సరే క టీజర్ తోనే సినిమాకు మంచి హైప్ రాగా థియేట్రికల్ రైట్స్, నాన్ థియేట్రికల్ రైట్స్ రెండు కూడా సేల్ అయినట్టు తెలుస్తుంది. కిరణ్ అబ్బవరం క మూవీ థియేట్రికల్ రైట్స్ 13 కోట్ల దాకా పలికినట్టు తెలుస్తుంది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా 8 కోట్ల దాకా డిమాండ్ చేశారట.

అంటే రెండు కలిపి సినిమాకు 21 కోట్ల దాకా టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్టు. సుజిత్, సందీప్ దర్శక ద్వయం డైరెక్ట్ చేస్తున్న క సినిమా టోటల్ బడ్జెట్ 18 కోట్లని తెలుస్తుంది. కిరణ్ కంబ్యాక్ ఇచ్చేందుకు ఇది ఒక మంచి స్కోప్ ఉన్న ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. క సినిమాలో కిరణ్ ఒక పోస్ట్ మ్యాన్ గా కనిపిస్తున్నాడు. టీజర్ తోనే ఇది పాన్ ఇండియా రిలీజ్ అంటూ హంగామా మొదలు పెట్టారు. మొత్తానికి కిరణ్ అబ్బవరం కూడా పాన్ ఇండియా రిలీజ్ సినిమాలతో అదరగొట్టాలని చూస్తున్నాడు. క హిట్ పడింది అంటే ఇక కిరణ్ నెక్స్ట్ సినిమాల విషయంలో కూడా అదే పద్ధతి ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సినిమా టీజర్ తో ఏర్పడ్డ అంచనాలకు తగినట్టుగానే బిజినెస్ జరిగింది. ఐతే సినిమా కూడా ఆడియన్స్ ని కచ్చితంగా అలరిస్తుందని చెబుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: