ఎప్పుడు అయితే బాహుబలి సినిమా హిందీ ఏరియాలో అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసిందో అప్పటి నుండి చాలా సౌత్ సినిమాలను హిందీ లో విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే అనేక సౌత్ మూవీ లు హిందీ ఏరియాలో అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే తాజాగా ప్రభాస్ "కల్కి 2898 AD" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కూడా హిందీ ఏరియాలో అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేస్తుంది.

ఇక ఇప్పటి వరకు సౌత్ నుండి విడుదల అయిన సినిమాలలో హిందీ ఏరియాలో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 2 సినిమా 511 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరో గా రూపొందిన కే జీ ఎఫ్ చాప్టర్ 2 సినిమా 435.2 కోట్ల కలెక్షన్ లతో రెండవ స్థానంలో ఉంది. ఇక జూన్ 27 వ తేదీన విడుదల అయిన కల్కి సినిమా ఇప్పటికే హిందీ ఏరియాలో 277.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి 3 వ స్థానంలోకి వచ్చింది.

ఇక రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 276.80 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి నాలుగవ స్థానంలో నిలిచింది. ఇన్ని రోజుల పాటు ఆర్ ఆర్ ఆర్ సినిమా 3 వ స్థానంలో ఉండగా ... కల్కి సినిమా ఈ సినిమాను వెనక్కు నట్టేసి 3 వ స్థానంలోకి వెళ్ళింది. దానితో ఆర్ ఆర్ ఆర్ సినిమా 4 గా స్థానంలోకి వెళ్ళింది. ఇక ఈ సినిమా నెక్స్ట్ టార్గెట్ కే జీ ఎఫ్ చాప్టర్ 2. కాకపోతే కే జీ ఎఫ్ చాప్టర్ 2 సినిమా రికార్డును బ్రేక్ చేయడం కలిగి చాలా కష్టమైన విషయం అని చెప్పాలి. ఎందుకు అంటే కల్కి కి కే జీ ఎఫ్ చాప్టర్ 2 మధ్య తేడా భారీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: