సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవరి కెరియర్ ఎలా మలుపు తిరుగుతుంది అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇండస్ట్రీలో రాణించాలి అంటే కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు. ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలని ఎంతో మంది సినీ ప్రముఖులు చెబుతూ ఉంటారు. ఇలాంటి అదృష్టం కలిసి రాక ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్స్ రెండు మూడు సినిమాలకు మాత్రమే పరిమితమై.. ఇండస్ట్రీలో కనుమరుగైన వారు ఉన్నారు. ఇంకొంతమంది కాస్త టాలెంట్ తక్కువ ఉన్న వరుస అవకాశాలు అందుకొని స్టార్లుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు.


 మరి ముఖ్యంగా హీరోయిన్లు స్టార్ హీరోయిన్గా మారాలి అంటే అదృష్టం బాగా కలిసి రావాలి. అదృష్టం ఉంటే తప్ప ఇండస్ట్రీలో ఉన్న పోటీని దాటుకునీ స్టార్లుగా ఎదగడం కష్టం అని చెప్పాలి. అయితే ఈ మధ్యకాలంలో ఇలా చిన్న సినిమాతో కెరీర్ మొదలుపెట్టి ఇక ఇప్పుడు బడా హీరోలు అందరితో కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తుంది ఒక హీరోయిన్. ఆమె ఎవరో కాదు మీనాక్షి చౌదరి. ప్రస్తుతం ఆమె ఫుల్ స్వింగ్ లో కొనసాగుతూ  ఇక వరుస సినిమాలతో ఊపిరి సలపనంత బిజీగా ఉంది అని చెప్పాలి మీనాక్షి చౌదరి. ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది.


 ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు దక్కకపోయినా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఫుల్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న విశ్వంభరా మూవీలో నటిస్తుంది. అదే సమయంలో క్రేజీ హీరో విశ్వక్సేన్ సరసన మెకానిక్ రాఖీ మూవీలోను ఛాన్స్ కొట్టేసింది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మట్కా సినిమాలో అవకాశం దక్కించుకుంది. అంతేకాదు కోలీవుడ్ ఇండస్ట్రీలో దళపతి విజయ్ గోట్ సినిమాలో కూడా నటిస్తోంది మీనాక్షి చౌదరి. ఇలా సీనియర్లు జూనియర్లు.. తెలుగు తమిళం మలయాళం అనే తేడా లేకుండా ఫుల్  బిజీగా మారిపోయింది మీనాక్షి.

మరింత సమాచారం తెలుసుకోండి: