సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే సినిమాలో నటించారు అంటే చాలు ఇక ఇద్దరు హీరోల అభిమానులు అందరూ కూడా ఆ సినిమాను సూపర్ హిట్ చేసేస్తూ ఉంటారు. ఇక దర్శక నిర్మాతలకు కూడా ఇలా మల్టీస్టారస్ సినిమా మినిమం గ్యారెంటీ మూవీ గా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు హీరోల అభిమానులు సినిమా చూస్తారు కాబట్టి తప్పకుండా సినిమా సూపర్ హిట్ అవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలాంటి మల్టీ స్టారర్ సినిమాలను తీయడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే ఇలా మల్టి స్టారర్ సినిమాలు వస్తేనే ఈ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఏకంగా ఒకే కుటుంబం నుంచి స్టార్ హీరోలుగా ఎదిగిన వారు సినిమాలు చేస్తే.. ఇక ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు ఒక క్రేజీ కాంబినేషన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది అనేది తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కేవలం తమిళంలోనే కాదు అటు తెలుగులో కూడా స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు సూర్య. తన సినిమాలు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాయి.


 అయితే సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైన కార్తి.. ఇక తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్లను దక్కించుకుంటూ ఉంటాడు అని చెప్పాలి. ఇక ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి అదరగొడుతూ ఉంటాడు. కాగా ప్రస్తుతం సూర్య కంగువ అనే సినిమాలో నటిస్తూ ఉండగా.. ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన విడుదలకు సిద్ధమవుతుంది. ఇప్పుడు ఈ స్టార్ అన్నదమ్ముల గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారిపోయింది. కంగువ సినిమాలో సూర్య తమ్ముడు కార్తీ ఒక స్పెషల్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడని.. ఇక వీరిద్దరి కలయికలో ఉండే సీన్స్ సీక్వల్ కు దారి తీస్తాయని ఒక టాబ్ చక్కర్లు కొడుతుంది. దీంతో అన్నదమ్ములు ఇద్దరిని కూడా ఒకే స్క్రీన్ పై చూడ్డానికి అభిమానులు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: