మూడు వారాల గ్యాప్ లో రెండు భారీ సినిమాలు విడుదల అయినప్పుడు సాధారణంగా ఆ రెండు సినిమాలలో ఏదో ఒక సినిమా హిట్ అవుతూ ఉంటుంది. వరసగా రెండు భారీ సినిమాలు హిట్ అయిన సందర్భాలు చాల అరుదు. దీనికితోడు ఆమూడు వారాల గ్యాప్ లో విడుదల అయ్యే భారీ సినిమాలు తండ్రి కొడుకులకు సంబంధించింది అవ్వడం చాల అరుదైన విషయం.



గతంలో ఒకసారి ఇలా జరిగిన సందర్భం ఉంది. 2016 డిసెంబర్ 9న  రామ్ చరణ్ ‘ధృవ’ రిలీజ్ అయింది. తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘తని ఒరువన్’ రీమేక్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించిన ఆమూవీ అప్పట్లో సూపర్ హిట్. ఆమూవీ విడుదలైన మూడు వారాలలోనే 2017 జనవరి 11న సంక్రాంతిని టార్గెట్ చేస్తూ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.



9 సంవత్సరాల గ్యాప్ తరువాత మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీగా విడుదలైన ఈమూవీ అప్పట్లో సూపర్ హిట్. ఇప్పుడు అదే సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ కాబోతోందా అన్న సందేహాలు వస్తున్నాయి. డిసెంబర్ లో ‘గేమ్ చేంజర్’ వస్తుంన్నట్లుగా దిల్ రాజ్ ప్రకటన చేశాడు. ఇప్పుడు ఆమూవీ క్రిస్మస్ రేస్ కు రాబోతోంది అని తెలుస్తోంది. ఈ మూవీ విడుదలైన మూడు వారాల గ్యాప్ లో జనవరి 10న చిరంజీవి ‘విశ్వంభర’ విడుదల కాబోతోంది.



దీనితో మళ్ళీ ఒకనాటి మెగా సెంటిమెంట్ రిపీట్ అవుతుందని మెగా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతానికి తెలుస్తున్న సమాచారం మేరకు ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పులు లేవని తెలుస్తోంది. దీనితో అటు క్రిస్మస్ కు ఇటు రాబోతున్న సంక్రాంతికి జరగబోతున్న ఈ సంక్రాంతి వార్ లో మెగా స్టార్ చిరంజీవి చరణ్ లు ఇద్దరూ ఘన విజయం సాధిస్తారని మెగా అభిమానులు చాల ఆశలు పెటుకున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: