సాధారణంగా హీరో హీరోయిన్ల డేటింగ్ విషయాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఏకంగా సినీ సెలబ్రిటీల ప్రొఫెషనల్ విషయాలు తెలుసుకోవడం కంటే ఇలాంటి ప్రేమాయణాల గురించి వార్తలు తెలుసుకోవడానికి  నేటిజన్స్ అందరు కూడా తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. దీంతో ఇలాంటి వార్త ఏదైనా తెరమీదకి వచ్చింది అంటే చాలు అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కారణంగా అటు సినీ సెలెబ్రిటీలకు అభిమానులకు మధ్య ఉన్న దూరం పూర్తిగా తగ్గిపోయింది. ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు తమ పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో ఏకంగా స్నేహితులతో పంచుకున్నట్లుగానే అన్ని విషయాలు పంచుకుంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు కొంతమంది హీరోయిన్లు ఏకంగా తమ ప్రేమాయనాల గురించి షాకింగ్ విషయాలు చెప్పి అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇక ఎప్పుడూ ఒక హీరోయిన్ ఇలాగే తన ప్రేమాయణంఫై ఓపెన్ అయింది.


 నాలుగేళ్ల ప్రేమ వ్యవహారం పై హీరోయిన్ అవికా గోర్ స్పందించింది. మిలింద్ చాంద్వాని తాను ఆరు నెలల పాటు స్నేహితులుగా ఉన్నామని.. ఇక అతనే ప్రపోజ్ చేసినట్లు చెప్పుకొచ్చింది. వెంటనే తాను కూడా ఎస్ చెప్పాను అంటూ హీరోయిన్ అవికా గోర్ తెలిపింది. ఇక తమ ఇద్దరి మనసులు కలిసాయని.. మానసికం గా తమకు పెళ్లి అయింది అని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. కాగా తెలుగు లో ఉయ్యాల జంపాల అనే సినిమా తో హీరోయిన్గా అవతారం ఎత్తిన ఈ  ముద్దుగుమ్మ ఆ తర్వాత ఈ సినిమా మంచి హిట్ కావడంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంది. అంతకుముందు చిన్నారి పెళ్ళికూతురు అనే సీరియల్ తో తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: