నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బాబి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఊర్వశి రౌటేలా ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని బాబి పక్క అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నాడు.

మూవీ కి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత బాలకృష్ణ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టడంతో కొన్ని రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఇక ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్న బాలకృష్ణ తిరిగి మళ్ళీ ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క తాజా షెడ్యూల్ రాజస్థాన్ లోని జైపూర్ లో తాజాగా ప్రారంభం అయింది. ఈ షెడ్యూల్ లో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ షెడ్యూల్ తో ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ కంప్లీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే అఖండ , వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి మూడు మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకున్న తర్వాత బాలకృష్ణ నటిస్తున్న మూవీ కావడం , వాల్టేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న తర్వాత బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: