విక్టరీ వెంకటేష్ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా సైన్ధవ్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి శైలేష్ కొలను దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి శ్రద్ధ శ్రీ నాథ్ ఈ మూవీ లో వెంకటేష్ కి జోడిగా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని ఎదుర్కొంది. ఇక ఈ మూవీ తర్వాత ఎలాగైనా మంచి కొట్టాలి అనే కసితో ఉన్న వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇకపోతే ఈ మూవీ కి ఇప్పటి వరకు మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు.

దానితో ఈ మూవీ బృందం ఈ సినిమా వెంకటేష్ , అనిల్ రావిపూడి కాంబో లో రూపొందుతున్న మూడవ సినిమా కావడంతో వెంకీ అనిల్ 3 అనే వర్కింగ్ టైటిల్ తో స్టార్ట్ అయ్యింది. ఇకపోతే ఆగస్టు నుండి ఈ మూవీ షూటింగ్ లో వెంకటేష్ జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతలోపు అనిల్మూవీ లో వెంకటేష్ లేకుండా వచ్చే సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటి మణులు అయినటువంటి ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మూవీ బృందం విడుదల చేసింది. ఇక ఇప్పటికే వెంకటేష్ , అనిల్ రావిపూడి కాంబోలో రూపొందిన ఎఫ్ 2 , ఎఫ్ 3 మూవీ లు బ్లాక్ బస్టర్ విజయాలు కావడంతో వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం ఉంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: