అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా యొక్క రెండవ భాగాన్ని మొదట ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఈ సినిమా ప్రచారాలను కూడా మొదలు పెట్టారు. దానితో ఈ మూవీ కచ్చితంగా ఆగస్టు 15 వ తేదీన విడుదల అవుతుంది అని అంతా అనుకున్నారు.

కానీ ఈ సినిమా పనులు ఆగస్టు 15 వ తేదీ వరకు పూర్తి కావడం అసంభవం అనే ఉద్దేశంతో ఈ మూవీ ని పోస్ట్ పోన్ చేసి డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 6 వ తేదీన ఖచ్చితంగా విడుదల అవుతుంది అనే సమీకరణాలు కనిపించిన తర్వాత మళ్లీ ఈ మూవీ షూటింగ్ పనులు అనుకున్నంత స్పీడ్ గా జరగడం లేదు అని , ఈ మూవీ మరోసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆగస్టు 15 వ తేదీన ఈ సినిమా విడుదల తేదీ అని ప్రకటించిన తర్వాత దాని దగ్గరికి ఎవరూ రాలేదు.

మూవీ పోస్ట్ పోన్ కాగానే ఆ తేదీన ఐదు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇక డిసెంబర్ 6 వ తేదీన కూడా ఈ మూవీ పోస్ట్ పోన్ అయితే ఆ మూవీ పై కూడా ఓ మూవీ యూనిట్ కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ధనుష్ , నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఆగస్టు 6 వ తేదీన కనుక పుష్ప పార్ట్ 2 మూవీ విడుదల కాలనట్లయితే ఆ తేదీన కుబేర మూవీ ని విడుదల చేయాలి అనే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: