సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలలో హీరోగా నటించాడు. ఇక మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీలలో మురారి , ఒక్కడు మూవీ లు కూడా ఉన్నాయి. ఇకపోతే మహేష్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9 వ తేదీన అనే విషయం మన అందరికీ తెలిసిందే. దానితో ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ల ట్రెండ్ జోరుగా కొనసాగుతూ ఉండడంతో గత ఒకటి , రెండు సంవత్సరాలుగా మహేష్ బాబు పుట్టిన రోజు వచ్చింది అంటే చాలు ఆయన నటించిన బ్లాక్ బాస్టర్ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు.

అందులో భాగంగా ఇప్పటికే కొన్ని సినిమాలను రీ రిలీజ్ చేయగా అవి అద్భుతమైన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సంవత్సరం మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9 వ తేదీన ఆయన నటించిన బ్లాక్ బాస్టర్ మూవీలలో ఒకటి అయినటువంటి మురారి మూవీ ని రీ రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా మూవీ యూనిట్ ప్రకటించింది. ఇక ఆగస్టు 9 వ తేదీన మురారి తో పాటు మరో బ్లాక్ బాస్టర్ మూవీ ని కూడా రీ రిలీజ్ చేయాలి అనే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు అదే ఒక్కడు. ఒక్కడు సినిమా కూడా మహేష్ బాబు కెరియర్ లో అద్భుతమైన విజయం సాధించిన సినిమాలలో ఒకటి. 

దానితో ఈ ఆగస్టు 9 వ తేదీన మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ని కూడా రీ రిలీజ్ చేయాలి అని ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నట్లు మరో ఒకటి , రెండు రోజుల్లో అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా మురారి తో పాటు ఒక్కడు మూవీ కూడా ఆగస్టు 9 కి రీ రిలీజ్ అయితే ఇది మహేష్ బాబు ఫ్యాన్స్ కు పండగ లాంటి న్యూస్ అనే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: