టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్ లలో సమంత ఒకరు. ఇక ఈమె తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లడంతో ఈమె ఇప్పటికే అనేక మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన ఆడి పాడింది. ఇక ప్రస్తుతం ఈమె కమర్షియల్ సినిమాలలో నటించడం కంటే కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో , వైవిధ్యమైన సినిమాలలో నటించడానికి ప్రముఖ ప్రాధాన్యతను ఇస్తుంది. అలాగే వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తుంది.

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం ఈమె రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఇందులో బోల్డ్ సన్నివేశాలలో కూడా కనిపించిన సమాంత తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ వెబ్ సిరీస్ తో ఈ బ్యూటీ కి హిందీ సినీ పరిశ్రమలో కూడా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న సిటాడెల్‌ అనే వెబ్ సిరీస్ లో కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది.

ఇకపోతే ఈ వెబ్ సిరీస్ విడుదల కాక ముందే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందబోయే మరో వెబ్ సిరీస్ కు కూడా ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు టైటిల్ ని కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో రూపొందబోయే వెబ్ సిరీస్ కి రక్త్ బ్రహ్మాండం అనే వర్కింగ్ టైటిల్ ను ఇప్పటికే కన్ఫామ్ చేసుకున్నట్లు , ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: