కోలీవుడ్ నటుడు ధనుష్ తాజాగా రాయాన్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని జూలై 26 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. దానితో ఈ మూవీ బృందం తమిళ్ తో పాటు తెలుగు లో కూడా భారీ ఎత్తున ప్రచారాలను చేస్తూ వస్తుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్లు పంపించింది. 

ఈ విషయాన్ని ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేయగా అది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం వారు అనేక ప్రచార చిత్రాలను విడుదల చేశారు. అందులోనే భారీ యాక్షన్ సన్నివేశాలను చూపించారు. తాజాగా పూర్తి అయిన సెన్సార్ కార్యక్రమాలలో ఈ మూవీ కి "ఏ" సర్టిఫికెట్ రావడంతో ఈ సినిమాలో భారీ ఎత్తున రక్తపాతం ఉన్నట్లు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక ధనుష్మూవీ లో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు.

అలా ఈ మూవీ లో ధనుష్ హీరోగా నటించడం ,  ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. దానితో కూడా ఈ మూవీ పై కాస్త అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ధనుష్ ఈ మూవీ.తో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పొందుతున్న కుబేర అనే సినిమాలో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: