సింగర్ రహత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో పాటలు పాడుతూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మంచి సింగర్ గా పేరుని సంపాదించుకున్నాడు. సాధారణంగా సెలబ్రిటీలు ఏం చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. మంచి విషయం అయితే రెండు రోజుల వరకు నెట్టింట ఆ వార్తలే వైరల్ అవుతుంటాయి అదే చెడు అయితే అది నిజమో..అబద్ధము తెలుసుకోకుండా న్యూస్ లు నెగిటివ్ గా రాస్తూనే ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది.


దుబాయ్ ఎయిర్ పోర్టులో స్టార్ సింగర్ రాహత్ ఫతే ఆలీ ఖాన్ ను అరెస్ట్ చేసినట్లు పలు రకాల వార్తలు వచ్చాయి. అలీఖాన్ అరెస్ట్ చేసి జైలుకు తీసుకు వెళుతున్నాం అని అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకు ముందు అతని దగ్గర పని చేసిన సల్మాన్ ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేసిన వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ పోస్ట్ షేర్ చేశాడు. ఇదంతా అబద్ధం అంటూ ఒక పోస్ట్ ను రిలీజ్ చేశారు. చాలామంది నటిజెన్లు ఇలాంటి విషయాలను వైరల్ చేస్తూ ఉంటారు. మాజీ మేనేజర్ సల్మాన్, సింగర్ రహత్ ఫతే అలీ ఖాన్ పై పరువు నష్ట కేసు పెట్టారని పోలీసులు చెప్పినట్టు న్యూస్లు వచ్చాయి.


ఈ కేసులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ. ఈ కేసు గురించి మాత్రం తెగ పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇది ఫేక్ న్యూస్..నేను దీన్ని ఖండిస్తున్నాను వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటివి రాయకండి అంటూ రాహత్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టిండా వైరల్ గా మారింది. వీరి మధ్య గత కొంతకాలం నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా రాహత్, అహ్మద్ ఒకసారి ఒకరు కేసులు పెట్టుకున్నారని తెలిసిన సమాచారం. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం నెట్ ఇంకా హల్చల్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: