సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో టాలీవుడ్‌లో మార్కెట్ తెచ్చుకున్న కోలీవుడ్ నటుడు సూర్య. అసలు సూర్య సినిమాలు తెలుగులో రిలీజవుతున్నాయంటే..తెలుగు హీరో సినిమా రిలీజవుతుంది అనేలా అనిపిస్తుంది. అంతేకాదు సూర్యను తెలుగు రాష్ట్రాల దత్త పుత్రుడు అని ముద్దుగా పిలుచుకుంటుంటారు కూడా. సూర్య అంటే తెలుగు వాళ్లకు ఎంతిష్టం అంటే.. ఆయన నటించిన 24 సినిమా తమిళంలో ఫ్లాప్ అవగా.. తెలుగులో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టయింది. అంతలా సూర్య సినిమాలను మన వాళ్ళు ఆదరిస్తూ ఉంటారు. గజనీ సినిమా నుంచి.. జై భీమ్ సినిమా వరకు ప్రతీ సినిమాను మన వాళ్ళు అందరిస్తూ వస్తున్నారు.ఇక విక్రమ్ సినిమాలో రోలెక్స్ అనే క్యామియోకి.. మన టాలీవుడ్ ఫ్యాన్స్ చొక్కాలు చింపుకున్నారంటే అసలు మాములు విషయం కాదు. ఇక ప్రస్తుతం సూర్య.. కంగువా అనే పాన్ వరల్డ్ సినిమాతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అసలు అన్నీ ఇన్నీ కావు. 


ఇప్పటికే రిలీజైన టీజర్, గ్లింప్స్‌లు సినిమా పై మాములు అంచనాలు క్రియేట్ చేయలేవు. పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సూర్య యుద్ధ వీరుడుగా కనిపించనున్నాడు. ఈ మూవీ తమిళం నుంచి తొలి వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ఇంకా అంతేకాకుండా ఈ సినిమా దాదాపు 38 భాషల్లో రిలీజ్ చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్.ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య లైనప్ సాలిడ్‌గా ఉంది. ఓ వైపు కంగువా సినిమా షూటింగ్ పూర్తి కాకముందే.. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ యాక్షన్ డ్రామా సినిమాని తీస్తున్నాడు. ఈరోజు సూర్య బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్‌లో సూర్య లుక్ అయితే మాములుగా లేదు. ఎక్కడో సముద్ర తీరానా ప్రేమ, సంతోషంతో పాటు యద్ధం.. ఒకరి కోసం చూస్తుందంటూ.. సూర్య డాన్ మేకోవర్‌లో చింపేశాడనే చెప్పాలి.అసలు అలా గన్ను పట్టుకుని పక్కన బాడీగార్డ్స్‌తో నడిచి వస్తుంటే... రోలెక్స్‌ను మించిన క్యారెక్టర్‌ ఉండబోతుందా అనే క్యూరియాసిటీ అందరిలో క్రియేట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: