కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం శివ డైరెక్షన్ లో కంగువ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. సూర్య కంగువ సినిమా దాదాపు 10 భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ లో జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందించినట్టు తెలుస్తుంది. ఐతే ఈసారి దసరా బరిలో సూర్య కంగువ వస్తుంది.

కంగువ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ లాక్ చేయగా సినిమా ప్రమోషన్స్ కి నెల రోజులు డేట్స్ ఇచ్చాడట సూర్య. సెప్టెంబర్ మొత్తం కంగువ ప్రమోషన్స్ కోసమే సూర్య టైం కేటాయిస్తారని టాక్. ఈ సినిమా ఎలాగు నేషనల్ వైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి మేజర్స్ సిటీస్ లో ప్రమోషన్స్ చేయాలని అనుకుంటున్నారు. కంగువ సినిమా ప్రమోషన్స్ కోసం సూర్య అండ్ టీం సూపర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

కొన్నళ్లుగా కంటెంట్ ఉన్న సినిమాలతో కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉన్న సూర్య కంగువతో మళ్లీ తన పాత రూట్ లోకి వచ్చారు. అంతేకాదు ఈ సినిమా తర్వాత కారీక్ సుబ్బరాజ్ తో మరో మాస్ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమాలో సూర్య వింటేజ్ లుక్ తో కనిపించబోతున్నారు. సో సూర్య ఫ్యాన్స్ కి ఈ రెండు సినిమా లతో పక్కా ఎంటర్టైన్మెంట్ వస్తుందని చెప్పొచ్చు. సూర్య కంగువతో పాటుగా ఈ సినిమా క్లైమాక్స్ లో కార్తి కూడా సర్ ప్రైజ్ చేస్తాడని తెలుస్తుంది. సూర్య సినిమాలో కార్తి ఫస్ట్ టైం కనిపిస్తున్నాడు. అందుకే కంగువ మీద మరింత హైప్ పెరిగింది. తప్పకుండా కంగువతో సూర్య తన మాస్ స్టామినా చూపించే ఛాన్స్ ఉంటుందని అనిపిస్తుంది. ఈ సినిమాకు పోటీగా రజినికాంత్ వేట్టయ్య వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: