రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా క్రియేటివ్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రమే 'కల్కి 2898 ఏడీ'. టైం ట్రావెల్ స్టోరీతో హాలీవుడ్ రేంజ్‌లో రూపొందిన ఈ సినిమాపై ఆరంభంలోనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని హై లెవెల్‌లో తీశారు. ఈ క్రమంలోనే జూన్ 27వ తేదీన ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల చేశారు.ఒక్క మన తెలుగు సినిమా మాత్రమే కాకుండా మొత్తం ఇండియన్ సినిమా గర్వించదగ్గ సినిమా మరో సినిమాగా ఈ ఏడాది వచ్చిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ "కల్కి 2898 ఎడి" కూడా ఒకటి. మరి రెబల్ స్టార్ ప్రభాస్ లేకపోతే ఒక బాహుబలి లేదు, ఆదిపురుష్ లేదు, ఇప్పుడు కల్కి కూడా లేదు అనే రీతిలో ఈ భారీ సినిమా వచ్చి కాసుల వర్షాన్ని కురిపించి తెలుగులో చరిత్ర సృష్టించింది. టోటల్ ఇండియన్ సినిమా దగ్గర 1000 కోట్లు సినిమాలు మూడు ఉన్న ఇండస్ట్రీగా టాలీవుడ్ ని బాలీవుడ్ లో సమం చేసింది.టెక్నికల్ వండర్‌గా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తూనే ఉంది. ఫలితంగా ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను తెచ్చుకుంటోంది.కల్కి సినిమా ఇంకా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది.

అయితే కల్కి సినిమాకి పార్ట్ 2 ఉందని సినిమా చివర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్ట్ 2 కోసం ఇప్పట్నుంచే అంచనాలు పెంచుకుంటున్నారు. ఆల్రెడీ కొంచెం షూటింగ్ కూడా అయిపోయిందని, 2025లో రిలీజ్ చేస్తామని కూడా తెలిపారు నిర్మాత. అయితే కల్కి సినిమాని రెండు పార్టులుగా తీయాలని ఎలా డిసైడ్ అయ్యారో తెలుసా.తాజాగా నాగ్ అశ్విన్ 2 అనే నెంబర్ రాసి ఉన్న ఒక పేపర్ ని ఫోటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి.. కల్కిని రెండు పార్టులుగా తీయాలని ఈ మెథడ్ తో డిసైడ్ అయ్యాం అంటూ తెలిపాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అంత పెద్ద కల్కి సినిమాని రెండు పార్టులుగా తీయాల వద్దా అని చిట్టీలు వేసుకొని చిట్టిల్లో 2 వస్తే పార్ట్ 2 తీయాలని ఫిక్స్ అయ్యారని నాగ్ అశ్విన్ ఇండైరెక్ట్ గా చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. కొందరు సరదాగా చెప్తున్నారేమో అని, నాగ్ అశ్విన్ పై సరదాగా చిట్టీలు వేసి కల్కి పార్ట్ 2 తీద్దామని డిసైడ్ అయ్యారా అని కామెంట్స్ చేస్తున్నారు.దీంతో అప్పుడే పార్ట్-2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి పార్ట్-2 పై స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ మేరకు కల్కి కథ మొత్తం పార్ట్-2 లోనే ఉంటుందని ఒక్కసారిగా హైప్ పెంచేసాడు. సీక్వెల్‌కు సంబంధించి నెలరోజుల షూటింగ్‌ చేశాం. దానిలో 20 శాతం బెస్ట్‌గా వచ్చింది. ఇంకా ముఖ్యమైన యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది అని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: