రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘రానా నాయుడు’. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా గతేడాది విడుదలైన ఈ సిరీస్‌ బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకుంది. అయితే ఫామిలీ ఇమేజ్ ఉన్న వెంకటేశ్‌.. మొదటిసారిగా బోల్డ్ కంటెంట్‌తో రావడంతో ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. బూతు సిరీస్ అని కూడా నెటిజెన్స్ కామెంట్స్ చేశారు.ముఖ్యంగా మన ఫ్యామిలీ హీరో వెంకటేష్‌ నుంచి అసభ్యకర వ్యాఖ్యలు వినడాన్ని మన ప్రేక్షకులు తీసుకోలేకపోయారు. దీంతో ఈ వెబ్‌ సరీస్‌ టాలీవుడ్‌ ఆడియన్స్‌ నుంచి నెగిటివిటీని అందుకుంది. అయినా కూడా విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ వెబ్‌ సిరీస్‌ హిట్‌ అయ్యింది.ఇవేమీ పట్టించుకోని రానా, వెంకటేశ్‌లు అప్పుడే సీక్వెల్‌ను ప్రకటించారు. తాజాగా సిరీస్‌కు సంబందించి నెట్‌ఫ్లిక్స్‌ అప్‌డేట్‌ ఇచ్చింది.నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ సిరీస్‌ మిలియన్‌ వ్యూస్‌ తెచ్చుకుని చరిత్ర సృష్టించింది. ఇక ఈ వెబ్‌ సీరిస్‌కు సీక్వెల్‌ కూడా ఉందని ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. అయితే తొలి సీజన్‌ వచ్చి సుమారు మూడేళ్లు అవుతుంది. ఇంకా 'రానా నాయుడు 2'కి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ లేదు. దీంతో ఈ వెబ్‌ సిరీస్‌ ప్రియులు అప్‌డేట్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దీనిపై నెట్‌ఫ్లిక్స్‌ క్రేజీ అప్‌డేట్‌ వదిలింది. 'రానా నాయుడు 2' షూటింగ్‌ మొదలైందంటూ చిన్న వీడియో వదిలింది. అందులో వెంకటేష్‌-రానాల యాక్షన్‌ సీన్‌ను చూపించారు. దీంతో సీజన్‌ 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో సీజన్‌ 2 గురించి నెట్‌ఫ్లిక్స్‌ యాజమాన్యం ఓ ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రానా నాయుడు వెబ్‌ సిరీస్‌ మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు నుంచి విశేష ఆదరణ లభించిందని, దానిని దృష్టిలో పెట్టుకునే సీజన్‌ 2 ప్లాన్‌ చేశాన్నారు. ఈ సీక్వెల్‌ ఎన్నో ట్విస్ట్‌లు, యాక్షన్‌, ఫ్యామిలీ డ్రామాతో మరింత ఆసక్తిగా ఉంటుందని, ఇది ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. త్వరలోనే ఈ సీజన్‌ విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ అప్‌డేట్‌ ఇచ్చిన కొద్ది రోజులకే తాజాగా 'రానా నాయుడు 2'అప్‌డేట్‌ ఇవ్వడంపై ఆడియన్స్‌ హ్యాపీ ఫీల్‌ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: