
ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా అనురాగ్ కుల్కర్ణి, దీప్తి సురేశ్ లు ఈ పాటను పాడారు. ఈ సినిమాకు వెట్రి పళణిస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కెఇ జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోండగా బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.' ఫైర్...' పాటకు తెలుగులో శ్రీమణి సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి, దీప్తి సురేష్ ఆలపించారు. అరవింద్ శ్రీనివాస్, దీపక్ బ్లూ, సాయి శరణ్, ప్రసన్న ఆదిశేష కోరస్ అందించారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వం వహించారు.ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో సూర్య ఓ గ్యాంగ్స్టర్ లుక్లో కనిపించి ఆకట్టుకున్నాడు. దీన్ని చూసి ఫ్యాన్స్ ఈ పాత్ర రోలెక్స్ వైబ్స్లో ఉందంటూ సంబరాలు చేసుకుంటున్నారు.