సూ పర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ‘జైలర్’ సూపర్ హిట్ తో సూపర్ ఫామ్ లో ఉన్నారు. నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం రజనీ ఫ్లాప్ పరంపరకు బ్రేక్ వేసింది.చాల కాలంగా హిట్ లేని రజనీకి జైలర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ దక్కింది. జైలర్ ఇచ్చిన ఉత్సాహంతో రజనీకాంత్ వరుస సినిమాలు చేస్తున్నాడు.జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ తో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'వేట్టైయన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు.కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టైటిల్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్, GM సుందర్, రోహిణి, రావు రమేష్, రమేష్ తిలక్ మరియు రక్షణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.రజనీకాంత్ పుటిన రోజు సందర్బంగా విడుదల చేసిన టీజర్ కు విశేష స్పందన లభించింది. ఎప్పుడు రెలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ నిర్మాణ సంస్థ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో నిరుత్సాహం గా ఉన్నారు. మొదట వెట్టయాన్‌ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయాలనీ భావించింది నిర్మాణ సంస్థ. కానీ ఇప్పుడు తమిళ సినీ వర్గాల నుండి వస్తోన్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబరు 31న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని టాక్. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ప్రకటన రానుందని యూనిట్ వర్గాల సమాచారం.ఈ చిత్రంతో పాటు రజనీకాంత్ మరో చిత్రంలోనూ నటిస్తున్నారు. హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో ‘కూలి’ చిత్రంలోను సూపర్ స్టార్ నటిస్తున్నారు. ఇటీవల కూలి ఫస్ట్ గ్లిమ్స్ కు విపరీతమైన స్పందన లభించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: