మాన్ అఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న సినిమా "దేవర" త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండగా, జాన్వి కపూర్  హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్నాయి సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల జాన్వి కపూర్ ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఇక వీడియో సోషల్ మీడియాలో తెగ వేరేలవుతోంది. ఇక ఇంటర్వ్యూలో తను ఇలా చెప్పుకొచ్చింది....దేవర సినిమాలో తాను

 నటించిన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. నేను ఇప్పటివరకు ఇలాంటి పాత్ర ఎప్పుడు చేయలేదు. ఈ చిత్రంలో నేను గ్రామీణ యువతి పాత్రలో నటిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా దేవర చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీలో నేను నటించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎన్టీఆర్ తో పాటు కొరటాల శివ లాంటి ప్రముఖ నటుడు మరియు దర్శకుడు తో పనిచేయడం ఒక గొప్ప అవకాశం అంటూ చెప్పుకొచ్చింది జాన్వి కపూర్. అయితే ఇప్పుడు దేవర పార్ట్ 1 జాన్వి పాత్ర ఎలా ఉంటుందో అని

  పార్టీ 2 లో ఆమె చేయబోయే పాత్రను హైలెట్ చేయనున్నారా... అనే దానిపై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. కాగా ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్ర సంగీతాన్ని అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మాణం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మొదటి పాట సెన్సేషనల్ హిట్ అయ్యింది. అయితే 2 సాంగ్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఈ పాట డ్యూయెట్ గా ఉండబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అనిరుద్ సాలిడ్ ట్యూన్ అందిస్తే కొరటాల విజువల్ గా ఊహించని ట్రీట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ పాటలో ఎన్టీఆర్, జాన్వి  కెమిస్ట్రీ కూడా అదిరిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఓవరాల్  గా చెప్పాలంటే మరో సాలిడ్ హిట్ లోడింగ్ అని చెప్పవచ్చు. కాగా ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి  రెడీ అవుతున్నారు మేకర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: