తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉండే దర్శక నిర్మాతలు హీరోలు కూడా ఎక్కువగా దైవం కాన్సెప్ట్ తో ఉండే స్టోరీలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అభిమానులను మెప్పిస్తూ ఉన్నారు. కచ్చితంగా దైవం మీద సినిమా వస్తే ఆ సినిమా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనే నమ్మకం అందరిలోనూ కలిగింది. ఇలాంటి ఎలివేషన్ తో శివుడి సినిమాతో కనెక్ట్ అయ్యే విధంగా హీరో అశ్విన్ బాబు శివం భజే అనే సినిమాలో నటించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ అప్సర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. భారీ బడ్జెట్ తో యాక్షన్ త్రిల్లింగ్ కథ అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.


తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు చిత్ర బృందం. హై వోల్టేజ్ యాక్షన్స్ సన్నివేషాలతో మరొకసారి అశ్విన్ బాబు ప్రేక్షకులను మైమరిపించేలా తన యాక్టింగ్ తో అదరగొట్టేశారు.. క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ ని చూస్తే మనకి అర్థమవుతోంది. ఈ ట్రైలర్ ఆరంభంలోనే పాకిస్తాన్ ఇండియాలో ఏదో ఒక పెద్ద విధ్వంసానికి కుట్ర చేస్తున్నట్లుగా చూపించారు. ఆ తర్వాత హీరో అశ్విన్ బాబుని యాక్షన్ సీక్వెన్స్ తో చూపించడం జరిగింది.


ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ ని మొదలుపెట్టి ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సమయంలోనే అశ్విన్ బాబు పైన ఎవరో అటాక్ చేసే విజువల్స్ ని మనకి చూపిస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుంది.. అఘోర క్యారెక్టర్ తో శివశక్తి కథలోకి ఎంటర్ అయ్యి ఏం చేస్తారు అని కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శివం భజే ట్రైలర్ మొత్తానికి ఆసక్తికరంగా మారింది.. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఎప్పుడు సరైన కథలతోనే అశ్విన్ బాబు ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ చిత్రంలో యాక్టర్ అర్బాజ్ ఖాన్ పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. హీరోయిన్గా సూర్యవంశి ఇందులో నటించింది. మరి ఏ మేరకు ఈ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: