డైరెక్టర్ RGV గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో డైరెక్టర్ గా చేస్తూ మంచి పేరును సంపాదించుకున్నాడు. రోజు రోజుకు విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీస్ వివాహం చేసుకోవడం, కొన్ని రోజుల పాటు కలిసి ఉండి మళ్లీ డివోర్స తీసుకోవటం కామన్ అయిపోయింది. ఇప్పటికే చాలామంది నటీనటులు, సెలబ్రిటీస్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా రామ్ గోపాల్ వర్మ విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల హార్థిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ విడాకులు ప్రకటించిన విషయం తెలిసింది.


వీరు డివోర్స్ తీసుకుంటున్నామని తెలిపిన తరువాత ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ చేశారు. విడాకులు అనేవి స్వర్గంలో నిర్ణయించబడుతాయంటూ ఆయన ట్విట్ చేశారు. ఆయన తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకోచ్చారు. పెళ్ళలు నరకంలో నిర్ణయించబడితే, విడాకులు స్వర్గంలో నిర్ణయించబడతాయి. వివాహం చేసుకోవడం కంటే జీతం తీసుకునే ఓ నర్స్ ను నియమించుకోవడం బెటర్, ఈరోజుల్లో పెళ్ళీలు ఇంతకాలం కొనసాగుతున్నాయి అంటే ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుతం రోజురోజుకు విడాకుల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవి చూసి పేద ప్రజలు డబ్బు ఖర్చు చెయ్యటం మూర్ఖద్యమే అంటూ రాసుకు వచ్చారు.


ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక హార్దిక్ పాండ్యా డివోర్స్ తర్వాత ఆర్జీవి ఈ కామెంట్స్ చేయటంతో, ఆ కపుల్ ను ఉద్దేశించే ఆర్జీవి ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు నెటిజెన్స్. సమంత- నాగచైతన్య, నిహారిక- చైతన్య చాలా సెలబ్రెటీలు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. చూస్తున్న కొద్ది విడాకులు తీసుకుంటున్న సెలబ్రిటీలు సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ఇదంతా చూసిన నటిజెన్లు పెళ్లిళ్లు చేసుకోవటం ఎందుకు విడాకులు తీసుకోవడం ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకునే దాకా ఎందుకు వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: