ప్రయోగాత్మక సినిమాలు అడ్వెంచర్ థ్రిల్లర్ జానర్స్ లో సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అడివి శేష్. ఈయన నటించిన గూడచారి, హిట్ 2, మేజర్,క్షణం వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడంతో అడివి శేష్ కి టాలీవుడ్ చాలామంది అభిమానులు అయ్యారు. అలాగే ఒకప్పుడు పంజా,బలుపు,బాహుబలి వంటి సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ పోషించిన అడివి శేష్ ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నారు. అయితే ప్రస్తుతం అడివి శేష్ గూడచారి 2 సినిమాకి సంబంధించి బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆరోజు ఆ హీరోయిన్ ని నేను జుట్టు పట్టుకొని ఈడ్చుకు వెళ్లాను అంటూ ఒక షాకింగ్ విషయాన్ని చెప్పారు.

అయితే ఈ విషయం ఇప్పటికే అందరికి తెలుసు కానీ అంతగా అబ్సర్వ్ చేసి ఉండరు. అదేంటంటే.. ఓ సినిమాలో అడివి శేష్ ఓ హీరోయిన్ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తూ ఉంటాడు.ఇక ఇప్పటికే ఆ సన్నివేశం మీకు  గుర్తుకొచ్చి ఉంటుంది.అదే బలుపు మూవీ లో శృతిహాసన్ ని జుట్టు పట్టుకొని ఈడ్చుకు వెళ్లే సన్నివేశం.అయితే సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అడివి శేష్ ఇలాంటి నెగటివ్ రోల్స్ చేశారు.ఇక బలుపు సినిమాలో శృతిహాసన్ ని అలా జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లే  సన్నివేశం చేయడానికి అస్సలు ఇష్టం లేదట. ఏ మాత్రం ఇష్టం లేకుండానే కేవలం స్క్రిప్ట్ లో భాగంగా డైరెక్టర్ చెప్పారు అనే ఒకే ఒక్క కారణంతో ఈ సన్నివేశంలో అడివి శేష్ నటించారట.

కానీ ఈ సీన్ చేయడం ఆయనకు ఇష్టం లేదట. అలాగే ఈ సన్నివేశం చేశాక తన మీద తనకే అసహ్యం పుట్టిందని, ఏంటి నేను ఇలాంటి సన్నివేశాల్లో చేస్తున్నాను అని అనిపించి అప్పటి నుండి నెగటివ్ రోల్స్ కి చెక్ పెట్టి హీరోగా చేశారు. అలా వరుసగా ఆయన చేసిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్టవ్వడంతో స్టార్ హీరో రేస్ లో కొనసాగుతున్నారు. ఇక ఈయన నటించిన గూడచారి మూవీకి సీక్వెల్ గా గూడచారి -2 మూవీ త్వరలోనే రాబోతుంది. దాదాపు సంవత్సరంన్నర పాటు ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ ప్రిపేర్ చేసుకున్నారట అడివి శేష్. మరి చూడాలి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: