ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ కాంబినేషన్ కు ఎంత క్రేజ్ ఉంటుందో.. అలాగే హీరో అండ్ విలన్ కాంబోకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే.. వీరి కాంబోకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. డైెరెక్టర్లు సైతం హీరోను ఢీకొట్టడానికి బలమైన విలన్ నే ఎంచుకోవాలని చూస్తుంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ న్యూస్ బీభత్సంగా వైరల్  అవుతోంది. అదేంటంటే? రజినీకాంత్ మూవీలో టాలీవుడ్ మన్మథుడు విలన్ గా నటిస్తున్నాడట.కోలీవుడ్ లో ఈ టాప్ గాసిప్ చక్కర్లు కొడుతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ కు విలన్ గా మన అక్కినేని నాగార్జున నటించబోతున్నాడు అని. వినగానే కాస్త ఎగ్జైటింగ్ గా అనిపించే న్యూస్ ఇది. ఆల్రెడీ రజినీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ తో కుబేర సినిమాలో నటిస్తున్నాడు నాగ్. ఇప్పుడు రజినీకి విలన్ గా అంటే పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. నాగ్ కటౌట్ కు విలన్ గా పనికొస్తాడా అనే డౌట్స్ చాలమందికి రావొచ్చు. కానీ ఆయన ఎప్పుడో ఆ తరహా పాత్రలు చేశాడు. ఒక బాలీవుడ్ మూవీలో విలన్ గా నటించాడు. అలాగే రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన అంతం సినిమాలో స్టైలిష్ గ్యాంగ్ స్టర్ గా నాగ్ చేసింది ఓ రకంగా విలన్ పాత్రే. అయినా ఏ క్యారెక్టర్ అయినా అదరగొట్టడం నాగ్ స్టైల్ కదా. అందుకు ఓకే చెప్పినా ఆశ్చర్యం లేదు. అయితే ఓకే చెప్పాడు అనే టాక్ కోలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. నాగ్ ఆ పాత్రకు ఒప్పుకోవడానికి ప్రధాన కారణం రజినీ మాత్రమే కాదు. దర్శకుడు కూడానట.షార్ట్ టైమ్ లో టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు లోకేష్ కనకరాజ్. ఖైదీ తెలుగువాళ్లను ఫిదా చేశాడు. విక్రమ్ తో ఎక్కడికో వెళ్లిపోయాడు. లోకేష్ సినీ వర్స్ అనేది క్రియేట్ చేసి తన కథలన్నీ ఇన్ డైరెక్ట్ గా ఒకే థ్రెడ్ తో నడిపిస్తున్నాడు. అలాంటి లోకేష్ ఇప్పుడు రజినీకాంత్ తో ‘కూలీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది లోకేష్ వర్స్ కు భిన్నంగా సాగే కథ అన్నారు. ఈ మూవీలోనే రజినీకి విలన్ గా నాగ్ ను తీసుకున్నారు అనే ప్రచారం జరుగుతోంది. నాగ్ కూడా లోకేష్ అయితే తన పాత్ర ఓ రేంజ్ లో ఉంటుందనే ఓకే చెప్పాడు అంటున్నారు. మరి ఈ న్యూస్ లో నిజమెంత అనేది త్వరలోనే తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: