ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుతున్న రష్మిక సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని చోట్ల తన ఫాం కొనసాగిస్తుంది. మొన్నటిదాకా అమ్మడు సౌత్ లోనే టాప్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకోగా యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఫేవరెట్ హీరోయిన్ అయ్యింది. అందుకే ఇక ఇప్పుడు అమ్మడికి అక్కడ వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్ లో రష్మిక దూకుడు ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు.

ఐతే రష్మిక ఓ పక్క పుష్ప 2 చేస్తూనే మరోపక్క విక్కీ కౌశల్ హీరోగా వస్తున్న చావా సినిమాలో నటిస్తుంది. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రష్మిక మహరాణి పాత్రలో కనిపించనుంది. పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా రిలీజ్ ని డిసెంబర్ లో ఫిక్స్ చేశారు. ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం రష్మిక నటించిన చావా సినిమా డిసెంబర్ 6న వస్తుందని అంటున్నారు.

ఐతే ఆల్రెడీ అదే రోజు అల్లు అర్జున్ పుష్ప 2 కూడా రిలీజ్ అవుతుంది. అంటే పుష్ప 2 వర్సెస్ చావా అంటే రష్మిక తో రష్మిక పోటీ పడుతుందని చెప్పొచ్చు. పుష్ప 2 లో శ్రీవల్లి పాత్రతో రష్మిక అదరగొట్టేయగా సెకండ్ పార్ట్ లో కూడా ఆ పాత్రకు మంచి స్కోప్ ఉన్నట్టు తెలుస్తుంది. రష్మిక సినిమాలు రెండు ఒకేరోజు రిలీజ్ అవ్వడం అమ్మడి ఫ్యాన్స్ కి సూపర్ జోష్ అందిస్తుంది. ఐతే ఏ సినిమా హిట్టైనా రష్మిక ఖాతాలో మరో సక్సెస్ పడినట్టే. ఒకవేళ ఏదైనా నిరాశపరిస్తే మాత్రం ఆ ఎఫెక్ట్ కూడా రష్మిక ఖాతాలో పడుతుంది. ఈం రెండు సినిమాలతో పాటుగా రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చేస్తుంది. ఇదే కాకుండా అమ్మడితో సినిమా చేసేందుకు మరో ఇద్దరు దర్శకులు లైన్ లో ఉన్నారని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: