నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ లో దగ్గుబాటి హీరోల్ద్దరు కలిసి చేసిన రానా నాయుడు వెబ్ సీరీస్ సూపర్ హిట్ అయ్యింది. సీరీస్ రిలీజైన మొదట్లో వెంకటేష్ చేసిన పాత్రకు కాస్త నెగిటివ్ కామెంట్స్ వచ్చినా అదంతా సౌత్ ఆడియన్స్ పనే అని తెలిసింది. వెంకటేష్ కెరీర్ లో ఇంతవరకు చేయని బోల్డ్ రోల్ అది కాబట్టే ఆయన్ను అలా చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం ఆ సీరీస్ ని ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. వెంకటేష్ తో పాటు రానా కూడా అదరగొట్టేయడంతో సీరీస్ పెద్ద హిట్ అయ్యింది.

ఇప్పుడు ఈ సీరీస్ కు సీక్వెల్ వస్తుంది. నెట్ ఫ్లిక్స్ వారు రానా నాయుడు 2 మొదలైందని అనౌన్స్ చేశారు. ఈ సెకండ్ సీజన్ మొదటి సీజన్ కన్నా మరింత భారీగా ఉండబోతుందని తెలుస్తుంది. ముఖ్యంగా సీజన్ కొనసాగింపుగా ఆడియన్స్ కోరుకునే అంశాలన్నీ ఇందులో ఉంచారట. రానా కూడా ఈ సీజన్ మీద చాలా ఫోకస్ గా ఉన్నాడు.

ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వెంకటేష్ ఈ సీరీస్ కు డేట్స్ ఇచ్చాడు. దగ్గుబాటి హీరోలు ఇద్దరు కూడా ఈ సీరీస్ కోసం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఐతే నెట్ ఫ్లిక్స్ వారు అడిగిన దానికి ఎక్కువగానే ఇచ్చిందని టాక్. రానా సినిమాల కన్నా ఇలా సీరీస్ లు చేసుకోవడమే బెటర్ అని అనుకుంటున్నాడు. మరి రానా నాయుడు 2 ఎలా ఉండబోతుంది. సీరీస్ లో ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయన్నది చూడాలి. దగ్గుబాటి ఫ్యాన్స్ కి మరోసారి ఈ సీరీస్ సూపర్ ట్రీట్ ఇవ్వనుందని చెప్పొచ్చు. వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపుడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు సంక్రాంతికి వస్తున్నాం అన్న టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: