కోలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలను తీస్తూ డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్ లియో తర్వాత ప్రస్తూం రజీని తో భారీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన డైరెక్షన్ స్టామినా చూపించాలని చూస్తున్న లోకేష్ తన నెక్స్ట్ సినిమా ఖైదీ 2 ని చేస్తున్నట్టు ప్రకటించాడు. కార్తి హీరో గా వచ్చిన ఖైదీ సినిమాతోనే లోకేష్ డైరెక్షన్ టాలెంట్ ఆడియన్స్ కు అర్ధమైంది. ఆ సినిమా తర్వాత కమల్ తో విక్రం తీశాడు లోకేష్. ఇక ఆ సినిమా ఏ రేంజ్ హిట్ అయ్యింది అన్నది తెలిసిందే.

విక్రం తో లోకనాయకుడు కమల్ హాసన్ తిరిగి ఫాం లోకి వచ్చారు. విక్రం తర్వాత లియో చేసిన లోకేష్ ఆ తర్వాత రజిని సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలాఉంటే ఖైదీ 2 సినిమా విషయానికి సంబందించి ఒక హింట్ ఇచ్చాడు లోకేష్. ఖైదీ 2 లో రోలెక్స్ పాత్ర ఉంటుందని అది వేరే లెవెల్ లో ఉంటుందని చెబుతున్నాడు.

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా విక్రం సినిమా లో రోలెక్స్ పాత్ర అదిరిపోయింది. సూర్య చేసిన ఆ పాత్ర థియేటర్ లో మోత మోగించింది. అయితే ఆ పాత్రను కొనసాగిస్తూ సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరగా ఫైనల్ గా ఖైదీ 2 లో రోలెక్స్ పాత్రకు సంబందించిన మరిన్ని సీన్స్ ఉంటాయని చెబుతున్నారు. అంతేకాదు సూర్యతో కూడా లోకేష్ నెక్స్ట్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. సూర్య రోలెక్స్ గా మరోసారి ఆడియన్స్ ని ఖుషి చేయనున్నారు.  రోలెక్స్ గా సూర్య మాస్ ట్రీట్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఖైదీ 2 ఓ కార్తి ఇంకా సూర్య ఇద్దరు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేస్తారని అంటున్నారు. అదే జరిగితే మాత్రం సినిమా రికార్డులు బద్ధలు కొడుతుందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: