బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో మొదలు కాబోతుంది. ఈ సీజన్ ని కూడా ఆడియన్స్ లో ఆసక్తి  కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు బిగ్ బాస్ టీం. ఈ క్రమంలో బిగ్ బాస్ 8 ని కొత్త కాన్సెప్ట్ తో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 7 లో ఉల్టా పుల్టా అంటూ ఆడియన్స్ ని కన్ ఫ్యూజ్ చేయగా ఇప్పుడు రాబోతున్న సీజన్ 8 లో రెండు హౌజ్ ల కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారట.

అంటే లాస్ట్ సీజన్ లా కన్ ఫర్మెడ్ కంటెస్టెంట్స్ లాగా ఈ సీజన్ లో కూడా ముందు టాస్కులు పెట్టి గెలిచిన వారిని కంఫర్మ్ చేసి వారికి వేరే హౌస్ ఇస్తారట. అందులో వెనకపడిన వారికి వేరే హౌజ్ ఉంటుందట. అంటే బిగ్ బాస్ హౌజ్ లోనే రెండు కేటగిరిలు గా చేసి ఇలా రెండు హౌజ్ లను ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది. ప్రతి సీజన్ ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకు రాకపోతే ఆడియన్స్ షోకి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు.

ఇక బిగ్ బాస్ సీజన్ 8 ని అన్నపూర్ణ స్టూడియోస్ లో కాకుండా వేరే చోటికి మార్చాలని ముందు అనుకున్నారట. ఇక్కడ సెక్యురిటీ సమస్య వస్తుందని బిగ్ బాస్ టీం ఆ డెసిషన్ తీసుకున్నారట. అయితే ఈ సీజన్ వరకు ఇలా కానిచ్చేసి నెక్స్ట్ సీజన్ కి మాత్రం అన్నపూర్ణా నుంచి షిఫ్ట్ చేస్తారని అంటున్నారు. ఐతే బిగ్ బాస్ సీజన్ 1 పూణెలో జరిగింది. అప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అన్నది కూడా లైవ్ లోనే చూసేంత ఎగ్జైట్ మెంట్ ఉండేది. కానీ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చేసరికి ఆ ఎక్స్ పీరియన్స్ లేకుండా ముందే లీకులు వచ్చేవి. ఈ సీజన్ లో అలాంటి లీక్స్ లేకుండా జాగ్రత్త వహిస్తున్నారట బిగ్ బాస్ టీం. మరి ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: