విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ ఆశించిన ఫలితాన్ని అందించలేదు. ఆ సినిమా ఫెయిల్యూర్ తర్వాత ఏమాత్రం లేట్ చేయకుండా తన నెక్స్ట్ సినిమా షూటింగ్ కు వెళ్లాడు రౌడీ స్టార్. ప్రస్తుతం గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విజయ్సినిమా నుంచి కొన్ని లీకైన ఫోటోల ద్వారా వార్తల్లో నిలుస్తున్నాడు. విజయ్ దేవరకొండ షార్ట్ హెయిర్ తో లుక్ డిఫరెంట్ గా ఉంది. ఐతే గౌతం తిన్ననూరి సినిమా గురించి ఒక న్యూస్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.

ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా 40 శాతం షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందని అంటున్నారు. ఈమధ్యనే ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ అంతా శ్రీలంక వెళ్లింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక సోల్జర్ గా కనిపించనున్నాడు. విజయ్ లాంటి గట్స్ ఉన్న హీరోకి ఈమధ్య సరైన కథలు పడట్లేదు. అందుకే రిలీజ్ ముందు ఉన్న హంగామా రిలీజ్ తర్వాత ఉండట్లేదు.

ఐతే విజయ్ మాత్రం గౌతం తిన్ననూరి సినిమాతో సూపర్ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా హిట్ టార్గెట్ తో పనిచేస్తున్నారని తెలుస్తుంది. విజయ్ కూడా సినిమా కోసం తన ఫుల్ ఎఫర్ట్ పెట్టేస్తున్నాడట. విజయ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ మూవీస్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. విజయ్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది మరి ఈ సినిమాతో ఆ కంబ్యాక్ హిట్ కొడతాడేమో చూడాలి. ఈ సినిమా తర్వాత రవికిరణ్, రాహుల్ సంకృత్యన్ లతో క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు విజయ్. రాబోతున్న 3 సినిమాలతో విజయ్ మాత్రం పక్కా హిట్ మేనియా కొనసాగిస్తాడని ఆయన ఫ్యాన్స్ నమ్ముతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: