సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సినిమా విడుదల విషయంలో పెద్దగా సమస్యలు ఏమి ఉండవు. ఎందుకు అంటే ఎలాగో భారీ సినిమాలపై అంచనాలు భారీగా ఉంటాయి. అలాగే వారి సినిమాలను కూడా పెద్ద రేంజ్ ఉన్న నిర్మాతలు నిర్మిస్తారు. కాబట్టి వారి సినిమా విడుదల తేదీలకు దగ్గర పడ్డాయి అంటే వారికి ఎక్కువ థియేటర్లు వస్తూ ఉంటాయి. ఇక మీడియం మరియు చిన్న హీరోలకే ఎక్కువ సమస్యలు ఉంటాయి. వారి సినిమాల విడుదల తేదీలు ముందుగా ప్రకటించిన ఆ దగ్గర తేదీలలో ఏ స్టార్ హీరో అయినా తమ సినిమాను విడుదల చేస్తే ఆటోమేటిక్ గా వారు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. లేదు అని వారు అదే తేదీన తమ సినిమాలను విడుదల చేస్తే తక్కువ థియేటర్లు దొరికే అవకాశం ఉంటుంది.

ఒక వేళ స్టార్ హీరో సినిమాకు గనక బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్లు అయితే మీడియం , చిన్న హీరోల సినిమాలకు మంచి టాక్ వచ్చినా కూడా కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంటుంది. దానితో స్టార్ హీరో సినిమా విడుదల అవుతుంది అంటే ఆ దగ్గర ప్రాంతాలలో మీడియం మరియు చిన్న హీరోల సినిమాలు లేకుండానే జాగ్రత్త పడతారు. ఇకపోతే చాలా కాలం క్రితమే నితిన్ హీరోగా రూపొందుతున్న రాబిన్ హుడ్ , నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న తండెల్ మూవీలను డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక అనూహ్యంగా డిసెంబర్ నెలలోకి అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ వచ్చేసింది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ చెంజర్ మూవీ ని కూడా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. ఈ రెండు మూవీ లు డిసెంబర్ నెలలో విడుదల అయితే నితిన్ , నాగ చైతన్య హీరోలుగా రూపొందుతున్న సినిమాలు వెనక్కు వెళ్లే అవకాశం ఉండే ఛాన్స్ ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: