కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కె.జి.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారని తమిళ మీడియా వైరల్ చేస్తుంది. ఐతే అది ఒక సూపర్ హిట్ సినిమా సీక్వెల్ అని కూడా అంటున్నారు. ప్రశాంత్ వర్మ సూపర్ హిట్ సినిమాలు కె.జి.ఎఫ్ 1, 2 లకు కొనసాగింపుగా కె.జి.ఎఫ్ 3 ఉంటుందని అంతకుముందే చెప్పాడు. ఐతే ఈ పార్ట్ 3 కి హీరోని కూడా మార్చే ఆలోచన లో ఉన్నాడట ప్రశాంత్ నీల్. యశ్ తో రెండు భాగాలుగా కె.జి.ఎఫ్ ని తీసిన ప్రశాంత్ నీల్ థర్డ్ పార్ట్ మాత్రం మరో హీరోతో వెళ్లాలని అనుకుంటున్నాడట.

లాస్ట్ ఇయర్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్న ప్రశాంత్ నీల్ ప్రభాస్ రేంజ్ సినిమాను ఇచ్చాడు. ఐతే సలార్ 2 కూడా పూర్తి చేయాల్సి ఉంది. ముందైతే కె.జి.ఎఫ్ 3 తీస్తాడని అంటున్నారు. యశ్ బదులుగా కె.జి.ఎఫ్ 3 లో కోలీవుడ్ హీరో అజిత్ నటిస్తాడని తెలుస్తుంది. అజిత్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈలోగా కె.జి.ఎఫ్ 3 కథ పూర్తి చేసి అతనితో సెట్స్ మీదకు వెళ్లే ఏర్పాట్లు చేస్తున్నాడు.

కె.జి.ఎఫ్ 3 సినిమాలో అజిత్ ని చూసి ఆయన ఫ్యాన్స్ ఎలాంటి హంగామా చూస్తారన్నది చూడాలి. కోలీవుడ్ స్టార్ హీరో గా తన మార్క్ చూపిస్తూ వస్తున్న అజిత్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. కె జి ఎఫ్ 3 అజిత్ తీయడం అంటూ జరిగితే మాత్రం అజిత్ కి కూడా పాన్ ఇండియా లెవెల్ లో బాక్సులు బద్ధలయ్యే క్రేజ్ వచ్చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే కోలీవుడ్ లో అతని మాస్ స్టామినా తెలిసేలా సినిమాలు చేస్తున్నాడు. కె.జి.ఎఫ్ 3 కూడా పడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: