పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ " కల్కి 2898 AD "..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమా ను బిగ్గెస్ట్ విజువల్ వండర్ గా తెరకెక్కించారు.వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ ఈ సినిమా లో ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ లభించింది.ఈ సినిమా మొదటి రోజు ఏకంగా 195 కోట్ల కలెక్షన్స్ సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది.

బాహుబలి సినిమాతో 1000  కోట్ల  కలెక్షన్స్ అందుకున్న ప్రభాస్ కల్కి సినిమాతో కూడా మరోసారి 1000 కోట్ల క్లబ్ లో చేరాడు.అయితే తాజాగా కల్కి సినిమా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్స్ కూడా క్రాస్ చేసి టాప్ వన్ దిశగా దూసుకుపోతుంది.అయితే కల్కి సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసేందుకు ముగ్గురు స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు.పుష్ప సినిమా తో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నాడు.తాజాగా ఆయన నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ లో రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా తో గ్లోబల్ వైడ్ పాపులర్ అవ్వాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు.అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా తో గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయిన ఎన్టీఆర్ ,రాంచరణ్ ఈ సారి దేవర ,గేమ్ ఛేంజర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.దీనితో ఈ ముగ్గురి స్టార్స్ లో ఎవరి సినిమా రికార్డు కలెక్షన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: