ఈ తరం దర్శకులలో ఫ్లాప్స్ లేకుండా వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న వారు కూడా కొంత మంది ఉన్నారు. అలా వరుస విజయాలతో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ఆ యువ దర్శకులు ఎవరు అనేది తెలుసుకుందాం.

అనిల్ రావిపూడి : ఈయన కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన పటాస్ మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత సుప్రీమ్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈయన దర్శకత్వంలో రూపొందిన రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 సరిలేరు నీకెవ్వరు , ఎఫ్ 3 , భగవంత్ కేసరి సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పటి వరకు ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన ఏ సినిమా కూడా ప్లాప్ కాలేదు. ప్రస్తుతం ఈయన వెంకటేష్ హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్నాడు.

నాగ్ అశ్విన్ : ఈ దర్శకుడు నాని హీరోగా రూపొందిన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన మహానటి మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం అయింది. ఇక తాజాగా కల్కి 2898AD మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి ఇప్పటికే 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇప్పటికి కూడా ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది.

సందీప్ రెడ్డి వంగ : ఈ దర్శకుడు విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ తో దర్శకుడిగా కెరీర్ ను మొదలు పెట్టి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత సందీప్ ఇదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో హిందీ లో రీమేక్ చేశాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. కొంతకాలం క్రితం ఈయన యానిమల్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: