మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తర్వాత ఈమె కిలాడి , హిట్ ది సెకండ్ కేస్ , గుంటూరు కారం లాంటి తెలుగు సినిమాలలో నటించింది. వీటి ద్వారా ఈమెకు మంచి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె చేతిలో అనేక మూవీలు ఉన్నాయి. ఈమె చేతిలో ప్రస్తుతం ఎన్ని సినిమాలు ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మీనాక్షి ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపించబోతోంది. టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ ప్రస్తుతం మెకానిక్ రాఖీ సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.


మూవీ లో కూడా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపించబోతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మీనాక్షి హీరోయిన్ గా కనిపించబోతోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న లక్కీ భాస్కర్ మూవీ లో కూడా మీనాక్షి హీరోయిన్ గా కనిపించబోతుంది. తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ హీరోగా రూపొందుతున్న ది గోట్ మూవీ లో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా మీనాక్షి చౌదరి చేతిలో ప్రస్తుతం 6 సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: