ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అటు సినీ సెలబ్రిటీల విడాకుల వ్యవహారాలు ఎంతలా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనస్పర్ధలతో కలిసి ఉండటం కంటే విడిపోయి సంతోషంగా ఉండడానికే ఎంతోమంది సెలబ్రిటీ జంటలు సిద్ధమవుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ తాము విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే నేటి రోజుల్లో పరిస్థితులు చూస్తూ ఉంటే ఎవరు ఎప్పుడు ఇలా సోషల్ మీడియాలో విడాకులు ప్రకటిస్తారు అన్న విషయం కూడా ఎవరికీ అర్థం కాని విధంగా మారిపోయింది పరిస్థితి.


 అయితే ఎవరైనా సినీ సెలబ్రిటీ జంటలు ఇలా విడాకుల ప్రకటించారు అంటే చాలు ఇక వారి గురించి సోషల్ మీడియాలో అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఈ మధ్యకాలంలో విడాకుల తర్వాత తమ జీవితం ఎలా ఉంది అన్న విషయాన్ని కూడా ఇక అభిమానులు అందరితో సెలబ్రిటీలు పంచుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం. అయితే తన భర్తతో విడాకులు ఇచ్చిన తర్వాత తాను ఎంతో సంతోషంగానే ఉన్నాను అంటూ చెబుతుంది ఒక సెలబ్రిటీ. ఆమె ఎవరో కాదు ఒక స్టార్ హీరో భార్య. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇలా విడాకుల తర్వాత సంతోషంగా ఉన్నాను అంటూ చెప్పిన వ్యక్తి ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు.



 అమీర్ ఖాన్ నా జీవితంలోకి రాకముందు నేను చాలా ఏళ్లు ఒంటరిగానే ఉన్నాను. ఆ సమయంలో ఒంటరితనాన్ని ఎంతగానో ఎంజాయ్ చేశాను. ఇప్పుడు నాకు కుమారుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని కాదు. అయితే ఇరు కుటుంబాలు నాకు అండగా ఉండడంతో ఎలాంటి భయం లేదు. చెప్పాలంటే ఇది సంతోషకరమైన విడాకులు అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు కిరణ్ రావు. గతంలో ప్రేమించి మరి అమీర్ ఖాన్ ను పెళ్లి చేసుకున్న కిరణ్ రావు ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో ఇక విడాకులు తీసుకొని వేరుగా ఉండడానికి రెడీ అయిపోయారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటికీ కొడుకు కోసం అమీర్, కిరణ్ రావు కలుస్తూనే ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: