కల్కి మూవీ డైరెక్టర్ నాగ అశ్విన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కల్కి సినిమా కథలో ఉన్న దమ్ము వల్లే స్టార్ హీరోలు, ఇతర నటీనటులు నటించేందుకు ముందుకొచ్చారని మూవీ డైరెక్టర్ దర్శకుడు నాగ అశ్విన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రిలో ఆయన తల్లిదండ్రులు జయంతి, జయరాం వైద్యులుగా విధులు నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం కల్కి సినిమా ప్రదర్శించబడుతున్న ఏవీడి థియేటర్ ను నాగ అశ్విన్ సందర్శించారు. అంతకు ముందు ఎప్విఎస్ ఆసుపత్రిలో నిర్వహకులు రామిరెడ్డి, థియేటర్ యాజమాని గుద్దేటి శివకుమార్ నాగ్ కు బొకే అందజేసి ఘన స్వాగతం పలికారు.


ఈ సందర్భంగా సినిమాకు వచ్చి ప్రేక్షకులను ఉద్దేశించి నాగ అశ్విన్ మాట్లాడుతూ..కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుత  విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. కథలో కొత్తదనం, దమ్ము ఉండటం వల్లే స్టార్ హీరోలు ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి వారు నటించారని గుర్తు చేశారు. సినిమా విజయం తనలో ఓ పట్టుదలను తెచ్చిందన్నారు. సెకండ్ పార్ట్ ను కూడా మరింత ఆసక్తికరంగా రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. సినిమా విజయం సాధించడంలో అందరి పాత్ర ఉందని అన్నారు. తనది నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం ఐదోలు గ్రామమని.. ఎస్వి ఎస్ ఆసుపత్రి నిర్మాణం అవుతున్న టైంలో మహబూబ్నగర్ లో అనుబంధం ఏర్పడిందని అన్నారు.


తాను ఎక్కడున్నా.. పాలమూరును మారిచే ప్రసక్తే లేదని అన్నారు. అనంతరం నాగ అశ్విన్ తల్లిదండ్రులు జయరాం, జయంతి మాట్లాడుతూ..తమ అబ్బాయికి మొదటి నుంచి మీడియా పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేదని తెలిపారు. ఆ రంగంలో ఇంత గొప్ప స్థాయికి చేరుకుంటాడని అనుకున్నాం కానీ. ఇంత పెద్ద సినిమా తీసి పేరు సంపాదిస్తాడని ఊహించలేదని అన్నారు. తల్లిదండ్రులుగా ఇంతకన్నా తమకు ఆనందం ఏముంటుందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం పండగలకు సంతూరు ఐతోలుకు తప్పకుండా వెళ్లి వస్తామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: